logo

మక్కా యాత్ర ప్రమాదంలో సజీవ దహనం అయిన 45 మంది హైదరాబాదీయుల మృతికి సంతాపం గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు.

క్రౌన్ హ్యూమన్ రైట్స్ గురజాల నవంబర్ 19;

పవిత్రమైన మక్కాయాత్ర ప్రమాదంలో ఉమ్రా యాత్రకు వెళ్లిన 45 మంది హైదరాబాదీయులు సజీవ దహనం అవడం అనేది చాలా దురదృష్టకరం. ఒక డ్రైవర్ చేసిన తప్పిదం వల్ల ఒకే కుటుంబానికి చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి నసీరుద్దీన్ కుటుంబానికి చెందిన 18 మంది చనిపోవడం అంటే ఇది అంతులేని విషాదం. మాటలకు అందని విషాదం. ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా మక్కా దర్శనం చేసుకుని, అల్లాహ్ ని ప్రార్థించి అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటారు. కానీ ఈ యాత్రలోనే ఈమధ్య ఇంత పెద్ద ఎత్తున సంఘటన ఎక్కడ కూడా జరగలేదు. ఇది జరగటం అనేది దురదృష్టకరం. దీనికి పూర్తిగా సంతాపం వ్యక్తం చేస్తున్నాను. అక్కడ ప్రభుత్వాలు ఇటువంటి సంఘటనలు జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం.

0
0 views