logo

స‌ర్‌ప్రైజ్‌: వెండి తెర‌పై దువ్వాడ‌ జంట‌

సోష‌ల్ మీడియాలో దువ్వాడ శ్రీ‌నివాస్‌, మాధురి తీసుకొచ్చిన వైబ్ ప్ర‌త్యేకంగా గుర్తు చేయాల్సిన ప‌ని లేదు. కొంత కాలం వీళ్ల హవా సాగింది. షార్ట్స్, మీమ్స్, రీల్స్‌.. ఎక్క‌డ చూసినా వీళ్లే. ఈ గుర్తింపు తోనే మాధురి బిగ్ బాస్ హౌస్ లోకి కూడా అడుగు పెట్టింది. ఇప్పుడు వెండి తెర‌పై కూడా ప్ర‌త్య‌క్ష్యం కాబోతోంది ఈ జంట‌. ఈనెల 21న విడుద‌ల కాబోతున్న ‘ప్రేమంటే’ సినిమాలో దువ్వాడ జంట‌ని చూడొచ్చు. ఇద్ద‌రిదీ అతిథి పాత్రే. కాసేపే తెర‌పై ఉంటారు. కాక‌పోతే ఆ ఎంట్రీ మాత్రం స‌ర్‌ప్రైజింగ్ గా ఉండ‌బోతోంద‌ని టాక్‌.

నిజానికి ఇటీవ‌ల విడుద‌లైన ఓ సినిమాలో దువ్వాడ జంట‌కు ఇలాంటి ఆఫరే వ‌చ్చింది. కానీ వాళ్లిద్ద‌రూ ఎందుకో ఒప్పుకోలేదు. ఈసారి మాత్రం ఓకే చేసేశారు. శ్రీ‌నివాస్ సంగ‌తేమో గానీ, మాధురికి మాత్రం సిల్వ‌ర్ స్క్రీన్ పై మెర‌వాల‌ని ఆశ‌. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది కూడా అందుకే. బిగ్ బాస్ ద్వారా సినిమాల్లో ఛాన్స్ వ‌స్తుంద‌ని ఆశించింది. ఇప్పుడు అదే నిజ‌మైంది కూడా.

ప్రియ‌ద‌ర్శి, ఆనంది జంట‌గా న‌టించిన సినిమా ఇది. ఇందులో సుమ క‌న‌కాల ఓ కీల‌క పాత్ర పోషించారు. దువ్వాడ శ్రీ‌నివాస్‌, మాధురిల‌తో పాటు ఈ సినిమాలో ఇంకొన్ని స‌ర్‌ప్రైజులు కూడా ఉండ‌బోతున్నాయ‌ట‌. అవేంటో సినిమా విడుద‌ల అయితేనే తెలుస్తుంది.

0
79 views