
ఎంపివో, పూర్వ డిపివో పై కేసులు నమోదు చేయండి
బుగ్గారం ఎస్సై కి పిర్యాదు చేసిన చుక్క గంగారెడ్డి
పంచాయతీ అధికారులు అవినీతి - అక్రమాలకు, ఇతర వ్యవసానాలకు
ఎంపివో, పూర్వ డిపివో పై కేసులు నమోదు చేయండి
బుగ్గారం ఎస్సై కి పిర్యాదు చేసిన చుక్క గంగారెడ్డి
పంచాయతీ అధికారులు అవినీతి - అక్రమాలకు, ఇతర వ్యవసానాలకు బానిసలయ్యారని ఆరోపణ
బుగ్గారం / జగిత్యాల జిల్లా:
బుగ్గారం ఎంపివో షేక్ అఫ్జల్ మియా, పూర్వ డిపివో చీకోటి మదన్ మోహన్ లపై కేసులు నమోదు చేయాలని కోరుతూ తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి మంగళ వారం బుగ్గారం ఎస్సై జి.సతీష్ కు రెండు వేర్వేరు పిర్యాదులు చేశారు.
ఇటీవల బదిలీ అయిన జిల్లా పంచాయతీ అధికారి చీకోటి మదన్ మోహన్, బుగ్గారం ఎంపివో షేక్ అఫ్జల్ మియా లు అవినీతి - అక్రమాలకు, ఇతర వ్యసనాలకు బానిసలుగా మారి బుగ్గారం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం పై క్రిమినల్ కేసులు నమోదు చేయడం లేదని ఆయన పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో ఆరోపించారు.
బుగ్గారం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ కు ఆదేశాలు జారీ చేస్తూ లోకాయుక్త న్యాయ స్థానం 2024 డిసెంబర్ 6న కేసు పిర్యాదు నం. 1432/2022/బి1 ద్వారా తీర్పు వెలువరించిందని పేర్కొన్నారు.
లోకాయుక్త తీర్పును అమలు పరుస్తూ జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ తేది: 06-01-2025 న ఉత్తర్వుల లేఖ నం. సి3/58/2025 ద్వారా జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారికి ఆదేశాలు జారీ చేశారు.
ఈ విషయంలో జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారి ఈ విషయాన్ని వ్యక్తిగతంగా పరిశీలించి, దుర్వినియోగం, నిధుల దుర్వినియోగం, మోసం మొదలైన వాటిలో పాల్గొన్న బుగ్గారం గ్రామ గ్రామ పంచాయతీ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని, గౌరవనీయులైన లోకాయుక్త తేదీ: 06.12.2024 నాటి ఆదేశాల ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేసి, తీసుకున్న చర్య నివేదికను కింద సంతకం చేసిన వారికి తప్పకుండా సమర్పించాలని ఆదేశించారు.
దీనిని అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించండి. అని కూడా అట్టి ఉత్తర్వులలో జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ సూచించారు.
అయినా నేటి వరకు జిల్లా పంచాయతీ అధికారి చీకోటి మదన్ మోహన్ ఎలాంటి విచారణ జరుప లేదని, ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయలేదని చుక్క గంగారెడ్డి పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో ఆరోపించారు.
అలాగే జగిత్యాల జిల్లా కలెక్టర్ (పం.వి.) నుండి మరోసారి తేది: 10-03-2025 న లేఖ నం. ఏ3/1501/2020-పం. ద్వారా ఉత్తర్వులు జారీ చేస్తూ గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగ పరచినందుకు బుగ్గారం తాజా మాజీ సర్పంచ్ మూల సుమలత - శ్రీనివాస్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయుటకు బుగ్గారం మండల పంచాయతీ అధికారిని ఆదేశించారు.
కానీ... నేటి వరకు ఎంపివో షేక్ అఫ్జల్ మియా కూడా బుగ్గారం తాజా మాజీ సర్పంచ్ మూల సుమలత - శ్రీనివాస్ పై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయలేదు.
కనీసం పోలీస్ అధికారులకు పిర్యాదు చేసినట్లు కూడా వారు ప్రకటించలేదని చుక్క గంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంపివో షేక్ అఫ్జల్ మియా తో పాటు ఇటీవల బదిలీ అయిన డిపివో చీకోటి మదన్ మోహన్ కూడా అవినీతి - అక్రమాలకు, ఇతర వ్యసనాలకు బానిసై లోకాయుక్త తీర్పును, చట్టాలను ఉల్లంఘించారని, జిల్లా కలెక్టర్ ల ఆదేశాలను బేఖాతర్ చేశారని, అత్యంత విలువైన వారి విధులను, బాధ్యతలను పూర్తిగా దుర్వినియోగం చేశారని, దోషులను కాపాడేందుకు చట్ట వ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. అని పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో వివరించారు. డిపివో, ఎంపివో లు అవినీతి - అక్రమాలకు, ఇతర వ్యసనాలకు పాల్పడడం కారణంగానే బుగ్గారం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం పై పోలీసు అధికారులకు కనీసం పిర్యాదు కూడా చేయలేక పోయారని బుగ్గారం గ్రామస్తులకు అనేక అనుమానాలు, సందేహాలు కలిగి తీవ్రమైన ఆరోపణలు కూడా గ్రామస్తుల నుండి వినిపిస్తున్నాయని చుక్క గంగారెడ్డి పోలీసులకు సూచించారు.
డిపివో, ఎంపివో లపై రెండు వేర్వేరు కేసులు (ఎఫ్.ఐ.ఆర్.లు) నమోదు చేసి లోకాయుక్త న్యాయస్థానం జారీ చేసిన తీర్పు ప్రతులను, జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి రెండు సార్లు జారీ చేయబడిన ఆదేశాల ఉత్తర్వుల ప్రతులను పరిశీలించి, డిపివో, ఎంపివో లపై ప్రజల్లో కలిగిన అనుమానాలు, ఆరోపణల పై తగు విచారణ జరిపి డిపివో చీకోటి మదన్ మోహన్, ఎంపివో షేక్ అఫ్జల్ మియా లపై చట్టపరంగా తగిన కఠిన చర్యలు తీసుకోవాలని బుగ్గారం ఎస్సై జి.సతీష్ కు చుక్క గంగారెడ్డి రెండు వేర్వేరు పిర్యాదుల ద్వారా మంగళ వారం విజ్ఞప్తి చేశారు.