logo

కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలి నవంబర్ 20 ‘ఛలో విద్యుత్ సౌధా’కు సీఐటీయూ పిలుపు

ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు నవంబర్18 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)

చందాపురం విద్యుత్ శాఖలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను సంస్థల్లో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని, డిస్కంల ప్రైవేటీకరణ ప్రయత్నా లను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 20న జరిగే ‘ఛలో విద్యుత్ సౌధా’ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొనాలని సీఐటీయూ పిలుపునిచ్చింది. ఈ సందర్భం గా మంగళవారం చందాపురం సబ్ స్టేషన్ వద్ద నాయకులు కరపత్రాలను విడుదల చేశారు.
సీఐటీయూ NTR జిల్లా అధ్యక్షుడు ఏ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ— విద్యుత్ శాఖలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, JLM గ్రేడ్–2, స్టోర్ హమాలీలు తదితర వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈ ఉద్యమం చేపడుతున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై EEFI పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల్లో ‘ఛలో రాజధాని’ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడలో నిర్వహించే ‘ఛలో విద్యుత్ సౌధా’ కార్యక్రమానికి UEEU, UECWU ఇప్పటికే మద్దతు తెలిపినట్లు గుర్తుచేశారు.
*ప్రధాన డిమాండ్లు* :
కాంట్రాక్టు & ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విలీనం చేసి రెగ్యులర్ చేయడం
గ్రేడ్–2 JLMలకు APSEB సర్వీస్ రూల్స్ అమలు
పెండింగ్‌లో ఉన్న 4 DAలు విడుదల
ఉద్యోగాల వయోపరిమితి పెంపు
పాత పెన్షన్ విధానం అమలు
PEST వర్కర్లకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం
కారుణ్య నియామకాల వారికి రెగ్యులర్ వేతనాలు
కాంట్రాక్టు కార్మికులకు ₹10 లక్షల గ్రాట్యూటీ, ₹1 కోటి ఇన్సూరెన్స్
పాత PRC ఎరియర్స్ విడుదల
JE, JA కన్వర్షన్ వేతన వ్యత్యాసాలు తొలగింపు
“వన్ ఇండస్ట్రీ–వన్ సర్వీస్” రెగ్యులేషన్ అమలు
ప్రభుత్వం–యాజమాన్యం సమస్యల్ని పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ముఖ్యంగా కార్మికుల విలీనంపై ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడం వల్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు ఆయన తెలిపారు. అదానీ ద్వారా స్మార్ట్ మీటర్లు అమలు చేయడం విద్యుత్ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించే ప్రయత్నంలో భాగమని ఆయన విమర్శించారు. విద్యుత్ సంస్థ మనుగడను కాపాడుకోవాలంటే ఉద్యోగులంతా ఐక్యంగా పోరాటానికి రంగంలోకి దిగాలని విజ్ఞప్తి చేశారు. నవంబర్ 20న జరిగే ‘ఛలో విద్యుత్ సౌధా’ లో అన్ని వర్గాల విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు– ఔట్సోర్సింగ్ కార్మికులు, PEST వర్కర్లు, JLM గ్రేడ్–2 సిబ్బంది భారీగా పాల్గొనాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కె.గోపాల్, బండి సత్యనారాయణ, రాజేష్,గాంధీ, భాష, కిషోర్ పాల్గొన్నారు.

0
0 views