logo

జిల్లాలో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ను పకడ్బందీగా అమలు చేయాలి: జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా.

నంద్యాల (AIMA MEDIA): జిల్లాలో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ను పగడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు.సోమవారం కలెక్టరేట్లోని తమ చాంబర్ నందు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా జూమ్ వీసీ ద్వారా డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ పై జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలు, ఐసిడిఎస్ పిడి, లతో డిస్టిక్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ....డౌరీ ఇచ్చుకోవడం పుచ్చుకోవడం చట్టరీత్యా నేరమని జిల్లాలో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ను పక్కాగా పకడ్బందీగా అమలు చేసేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.డౌరీ పైన ఎక్కడైనా నేరాలు జరిగినట్లయితే జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, లకు అరెస్టు చేయడం పెనాల్టీ వేయడం వంటి హక్కులు ఉంటాయన్నారు.డౌరీ కేసు కింద ఎవరైనా డౌరీ మర్డర్, డౌరీ డెత్ లు జరిగినట్లయితే బాధిత కుటుంబ సభ్యులకు 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలో డౌరీ నేరాలు హత్యలు పూర్తిగా నివారించేందుకు డౌరీ ప్రొహిబిషన్ యాక్టును పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డౌరీ యాక్ట్ కు సంబంధించిన పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు.

0
0 views