logo

ఎల్ ఆకారపు గట్లతో అదనపు ఆదాయం



రైతు తన పొలం గట్లను ఒక వైపు ఎల్ ఆకారపు వెడల్పాటి గట్లను తయారు చేసుకుని దానిపై కూరగాయలు పండ్ల మొక్కలు నాటుకుని అదనపు ఆదాయం పొంది ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చని వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతిరావు అన్నారు. అమ్మ వలసలు పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఎల్ ఆకారపు గట్లతో , ఏటీఎం కూరగాయల మోడల్ పై సి ఆర్ పి విజయ్ ఆధ్వర్యంలో ఇచ్చిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ రైతు తన ప్రధాన పంటకు కావలసిన పెట్టుబడిని అదనపు ఆదాయం ద్వారా పొందే విధంగా ప్రణాళిక వేసుకుంటే ఆదాయంతో పాటుగా ఇంటికి సరిపడా ఆరోగ్యవంతమైన కూరగాయలు పండ్లు పప్పు ధాన్యాలు సమకూరుతాయని కాబట్టి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరూ తమ గ్రామాలలో ఈ ప్రత్యేకమైన మోడల్ పద్ధతులపై రైతులకు విస్తృతమైన అవగాహన కల్పించాలని కోరారు. గట్లపై వ్యవసాయం ప్రతిరోజు రైతును పంట పొలానికి వెళ్లే విధంగా మారుస్తుందని, దీనివలన పంటలపై నిరంతర పరిశీలన జరిపి సరైన సమయంలో సరైన సస్యరక్షణ మరియు యాజమాన్య పద్ధతులను రైతు అవలంబించవలసి వస్తుందని, అందువలన ప్రధాన పంట దిగుబడి కూడా బాగా పెరిగే అవకాశం ఉందని కాబట్టి రైతులు సమీకృత వ్యవసాయ విధానాలను తప్పనిసరిగా అవలంబించాలని కోరారు.

31
2224 views