
రైతు సేవ కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఎంజీఆర్
AIMA న్యూస్ శ్రీకాకుళం : ▪️పాతపట్నం నియోజకవర్గంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ చర్యల్లో భాగంగా, ఎల్‌ఎన్‌పేట మండలం టీ.కె.పురం రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పాతపట్నం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు (ఎంజీఆర్) గారు నేడు ఘనంగా ప్రారంభించారు..*
*▪️ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ—రైతు కష్టపడితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, రైతు అన్నదాతకు సహాయం చేయడం ప్రభుత్వానికి ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కొనుగోలు కేంద్రం ద్వారా రైతులు తమ ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వానికి, MSP (కనీస మద్దతు ధర)కు విక్రయించే అవకాశాన్ని కల్పించడం ద్వారా మద్యవర్తులు, దళారులు లేకుండా పారదర్శకంగా లాభం అందేలా జరుగుతుందని తెలిపారు..) అంతేకాక, రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా తక్షణమే పరిష్కరించేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్థుల సమస్యలు, రైతుల సూచనలు అక్కడికక్కడే విని వెంటనే పరిష్కార చర్యలు తీసుకునే విధంగా వ్యవసాయ శాఖ,సివిల్ సప్లైస్ విభాగం అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు..*
*▪️ప్రారంభ కార్యక్రమంలో రైతులు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కొనుగోలు కేంద్రం ప్రారంభంతో తమకు రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు ధాన్యం విక్రయ ప్రక్రియ సులభతరం అవుతుందని ఆనందం వ్యక్తం చేశారు..*
*కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు,ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..*