logo

కూటమి పార్టీ కార్యాలయం లో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఎంజీఆర్

AIMA న్యూస్ శ్రీకాకుళం : ఏపీ సీఎం.. చంద్రబాబు – ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి కృషితో AP పెట్టుబడుల పటంలో అగ్రస్థానం… CII సమ్మిట్‌పై ఎమ్మెల్యే ఎంజీఆర్ ప్రశంసలు..*

*▪️విశాఖపట్నంలో జరిగిన 30వ CII సమ్మిట్ ఆంధ్రప్రదేశ్‌ను జాతీయ పెట్టుబడుల ప్రధాన కేంద్రంగా నిలబెట్టిందని పాతపట్నం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు గారు అన్నారు. ఈ సమ్మిట్ రాష్ట్ర అభివృద్ధిలో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందన్నారు..*

*▪️ఎమ్మెల్యే ఎంజీఆర్ గారు మాట్లాడుతూ—“సీఎం చంద్రబాబు గారి దూరదృష్టి, మంత్రి నారా లోకేష్ గారి డైనమిక్ నాయకత్వం వల్లే ఆంధ్రప్రదేశ్ ఈ స్థాయి పెట్టుబడులను ఆకర్షించగలిగింది. 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆమోదం పొందడం ద్వారా లక్షలాది యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించబడనున్నాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు పరిశ్రమలను విస్తరించే దిశగా ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలు అభినందనీయం. 'Made in AP' బ్రాండ్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన ఈ సమ్మిట్ రాష్ట్ర భవిష్యత్తును మరింత బలోపేతం చేస్తోంది” అని పేర్కొన్నారు.“CII సమ్మిట్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల రంగంలో కొత్త దిశలో అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రను పెట్టుబడుల కేంద్రంగా తయారు చేయడంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చేస్తున్న కృషి వల్లే అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంపై విశ్వాసం పెంచుకున్నాయి. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించడం అభినందనీయం. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ దేశంలో నంబర్ వన్ పెట్టుబడి గమ్యం అవడం ఖాయం” అన్నారు.సమ్మిట్‌ ద్వారా భారీ పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించిన ప్రభుత్వం చర్యలను నాయకులు అభినందించారు. రాష్ట్ర అభివృద్ధిలో ఇది కీలక మలుపు అవుతుందన్నారు..*

3
624 views