logo

మెలోడీ మెగా (26 వ విభావరి ) తో నవంబర్ 16 న అలరించబోతున్న స్వర బృందావనం

హైదరాబాద్ : స్వరబృందావనం 26 వ సంగీత విభావరి తో అద్భుత గాయని గాయకులతో, అందరిని అలరించడానికి వస్తోంది అని, నవంబర్ 16,,2025 న ఉదయం 9.00 నుంచి సా. 5.00 వరకు పాత కొత్త పాటల కలయికతో అందరిని ఆకట్టుకుంటుంది, కల్చరల్ టీవీ యూట్యూబ్ live లో పోగ్రామ్ వీక్షించాలని స్వరబృందావనం వ్యవస్థాపకులు, నిర్వాకులు, గాయకులు మరియు వ్యాఖ్యత అయిన శ్రీ బృందావనం రవికాంత్ గారు, మరియు స్వరబృందావనం సహా నిర్వాహకులు, గాయకులు అయిన శ్రీ తూములూరి శ్రీకుమార్ గారు నిన్న మీడియా తో మాట్లాడుతూ ప్రకటన విడుదల చేసారు. ఈ కార్యక్రమం లో శ్రీ s.జగ దీశ్వరరావు గారు వారి పెద్ద అల్లుడు అయిన శ్రీ అమరనాధ్ గారు పుట్టినరోజు కానుకగా co sponcer గ వ్యవహారిస్తున్నారు. అలాగే పెద్దలు అయిన శ్రీ విజయరాఘవన్ గారు అందరిని అలరించడానికి ఆత్మీయ ఆశీస్సులు అందజేయడానికి విచ్చేస్తున్నారు.
ఈ కార్యక్రమం లో ప్రముఖ గాయని గాయకులు రాష్ట్రము నలుమూలల నుంచి వస్తున్నారు అని శ్రీ రవికాంత్ గారు మీడియా కి తెలిపారు.

46
2992 views