logo

AIMA.11 మంగళవారం.మూడు ఏరియాల్లో సింగరేణి సీఎండీ శ్రీ ఎన్‌.బ‌ల‌రామ్. ఐఆర్ఎస్. సుడిగాలి పర్యటన.

మూడు ఏరియాల్లో సింగరేణి సీఎండీ శ్రీ ఎన్‌.బ‌ల‌రామ్ సుడిగాలి పర్యటన
రామగుండం - 1 లో బేస్ వర్క్ షాప్ ప్రారంభం, గోదావరిఖనిలో సీఎస్ఆర్‌ పనుల పరిశీలన
శ్రీరాంపూర్ లో ఐ కె ఓసి గని తనిఖీ, నీటి బిందువు జల సింధువు చెరువుల సందర్శన
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో కొత్త యూనిట్ భూమి పూజకు సన్నాహాల పై సమీక్ష , మిథనాల్ ప్లాంట్ , మినీ చెరువుల పరిశీలన

సింగరేణి సీఎండీ శ్రీ బలరామ్ ఆదివారం రామగుండం- 1, శ్రీరాంపూర్ ఏరియాలతో పాటు సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో విస్తృతంగా పర్యటించారు.
రామగుండం- 1 ఏరియాలో జీడికే 5 ఓపెన్ కాస్ట్ గని నీ సందర్శించి ఉత్పత్తిని సమీక్షించారు. ఓబీ డంపులపై నాటిన మొక్కలను పరిశీలించి తాను కూడ మొక్కలు నాటారు. ఈ ఓపెన్ కాస్ట్ గని కోసం నిర్మించిన బేస్ వర్క్ షాప్ ను ఆయన ప్రారంభించారు. సింగ‌రేణి సామాజిక బాధ్య‌త కార్య‌క్ర‌మంలో భాగంగా చేప‌ట్టిన సుంద‌రీక‌ర‌ణ ప‌నుల‌ను ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించారు. అలాగే కార్మిక కాల‌నీల్లో ప‌ర్య‌టించి క్వార్ట‌ర్ల స్థితిగ‌తుల‌ను అడిగి తెలుసుకున్నారు. కార్మికుల సంక్షేమం కోసం క్వార్ట‌ర్ల‌ను ఆధునికీక‌రించాల‌ని ఆదేశించారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఈ అండ్ ఎం శ్రీ ఎం తిరుమలరావు, ఏరియా జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు .

ఆ తర్వాత ఆయ‌న‌ శ్రీరాంపూర్ ఏరియాలోని ఐ కె ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించారు. ఉత్పత్తి ప్రక్రియ రవాణా తదితర అంశాలను సమీక్షించారు. లక్ష్యాలను సాధించాలని నిర్దేశించారు. గనికి పక్కన నిర్మించిన మినీ పార్కును సందర్శించారు. అలాగే నీటి బిందువు జలసింధువు కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసిన బలరామ జలధి మినీ చెరువును సందర్శించారు. భూగర్భ జలాల పెంపుదల కోసం ఉద్దేశించి ఏర్పాటు చేసిన చెరువుల్లో నీరు చేరి ఉండటం పై ఆయన తన సంతృప్తిని వ్యక్తం చేశారు. ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ శ్రీనివాస్ ఇంకా ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆ తర్వాత సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సందర్శించి ఇక్కడ నిర్మించనున్న 800 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన భూమిపూజ సన్నాహక పనులను సమీక్షించారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం వారిచే శంకుస్థాపన ఉంటుంది కాబట్టి తగు ఏర్పాటు చేసుకోవాలని ఎస్ టి పి పి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు జనరల్ మేనేజర్లను ఆదేశించారు. అదే ప్రాంగణంలోప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన మిథునాల్ ప్లాంట్ ట్రయల్ రన్ పనితీరును స్వయంగా పరిశీలించారు. త్వరలో ప్రయోగత్మకంగా ఉత్పత్తి ప్రారంభించాలని కోరారు.

2
369 views