logo

69 వ వార్డులో జీవీఎంసీ జనరల్ బాడీ మీటింగ్....

విశాఖపట్నం (హరిజన జగ్గయ్యపాలెం )

పారిశుద్ధ్యం కార్మికుల జనరల్ బాడీ సమావేశం 69వ వార్డు హరిజన జగ్గయ్య పాలెం జివిఎంసి వార్డు మస్తర్ పాయింట్ వద్ద జరిగింది.
జివిఎంసి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ నేతలు గొలగాని అప్పారావు జోన్ బాధ్యులు కార్యదర్శి&అధ్యక్షులు పి.వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి.8 గంటల పని దినాన్ని అవసరాన్ని బట్టి 13 గంటల వరకు పెంచు తున్నట్లు చట్టం చేశారు. శానిటరీ వర్కర్ల నడి వయసులో మరణం సంఖ్య పెరుగుతుందన్నారు.వీళ్లు చేసే సేవ కన్నతల్లి చెయ్యలేదు అని అన్నారు. సంవత్సరంకు క్యాజువల్ 15 లీవులు ఇవ్వకుండా కొన్ని వార్డులలో కార్మికులను మోసం చేస్తున్నారన్నారు.డెత్,రిటైర్మెంట్, పోస్ట్లు భర్తీ కావటం లేదు.అనారోగ్యం వల్ల బదిలీగా పనిచేస్తున్న పారిశుద్ధ్యం కార్మికుల పేర్లు మార్పు చేయటం లేదు. సేఫ్టీ పరికరాలు సబ్బులు, కొబ్బరినూనె డబ్బాలు,ఇవ్వాలని,సంక్షేమ పథకాలు అమలు చేయాలని పెండింగ్ సమస్యలు పరిష్కారం కాకపోతే మరో పోరాటానికి సిద్ధమవుతాం అని తెలియజేశారు. ఏ .నూకేశ్వరరావు,గొల్ల రాము తదితరులు పాల్గొన్నారు.

13
4420 views