logo

కర్నూలు జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్



ఢిల్లీలో భారీ పేలుడు సంఘటన

జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన...

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ .

జిల్లాలో ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు..

కర్నూలు , గుత్తి పెట్రోల్ దగ్గర ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ... జిల్లా ఎస్పీ.

ఈ రోజు ఢిల్లీలో ఎర్రకోట దగ్గర భారీ పేలుడు నేపథ్యంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

జిల్లా లో ఏకకాలంలో ముమ్మరంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ ప్రజల భద్రత , శాంతి భద్రతల పరిరక్షణే ద్యేయంగా కర్నూలు, గుత్తి పెట్రల్ బంక్ దగ్గర సోమవారం ఆకస్మికంగా వాహనాల తనిఖీలు చేపట్టారు.

భారీ పేలుడు సంఘటన నేపథ్యంలో, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు బృందాలు విస్తృతంగా తనిఖీలు ముమ్మరం చేశారు.

జిల్లా అంతటా బస్టాండ్లు, రైల్వేస్టేషన్స్, టోల్ గేట్స్, ముఖ్యమైన రద్దీ ప్రాంతాలలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా గారు కర్నూలు రైల్వే స్టేషన్ లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

జిల్లా ఎస్పీ గారి వెంట సిఐ విక్రసింహా ఉన్నారు.

12
3912 views