logo

గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను మ్యూజియం లో రూపకల్పన చేసిన ఐ టి డి ఏ పిఓ రాహుల్ ను అభినందించిన కెనడా ఎన్జీవో ఆర్గనైజర్ జోసెఫ్ జాక్సన్

తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా **భద్రాచలం ఐటిడిఏ మ్యూజియం*** నవంబర్ 11**( ఏఐఎం మీడియా ప్రతినిధి)

గిరిజన తెగల గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు అంతరించిపోకుండా నేటి యువతరం తెలుసుకునే విధంగా మ్యూజియం రూపకల్పన చేసిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు కెనడా ఆల్ బెర్ట్ కాలేజ్ ఆఫ్ సోషల్ వర్కర్ ఎన్జీవో ఆర్గనైజర్ జోసెఫ్ జాక్సన్ అన్నారు.
సోమవారం నాడు ఐటిడిఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంను కెనడా మరియు చత్తీస్గడ్ రాష్ట్రం ఎన్జీవోస్ బృందం సభ్యులు సందర్శించి మ్యూజియంలో పొందుపరిచిన గిరిజనుల అన్ని కళాఖండాలను క్లుప్తంగా తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దట్టమైన అటవీ ప్రాంతం మరియు కొండకోనల్లో నివసించే ఆదివాసి గిరిజనుల జీవన విధానాలను సాంప్రదాయాలను అధ్యయనం చేయడానికి ఈ రాష్ట్రానికి రావడం జరిగిందని, గిరిజనులు ఎక్కువ శాతం నివసించే జిల్లాలలోని గిరిజన గ్రామాలలో పర్యటించి ఈ జిల్లాకు రావడం జరిగిందని అన్నారు. గిరిజనుల జీవన విధానాలు మరియు సాంస్కృతి సాంప్రదాయాలు, పాతకాలపు గిరిజనుల పనిముట్లు పొందుపరిచిన గిరిజన మ్యూజియం భద్రాచలంలో ఉందని తెలుసుకొని మ్యూజియం సందర్శించడం జరిగిందని అన్నారు. అంతరించిపోతున్న గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు నేటితరం యువతీ యువకులకు, చిన్నపిల్లలకు తెలిసే విధంగా కళాఖండాలు ఏర్పాటు చేయడంతో పాటు వాటి యొక్క చరిత్రను అర్థమయ్యే విధంగా తెలుగులో మరియు ఇంగ్లీషులో ముద్రించి ప్రదర్శించడం వలన పర్యాటకులకు పూర్తిస్థాయిలో అవగాహన కలుగుతుందని, మ్యూజియంలో మాత్రం గిరిజనులకు సంబంధించిన స్పష్టమైన సమాచారం సందర్శకులకు తెలిసే విధంగా మ్యూజియం నిర్వహకులు ప్రతి అంశం తెలియజేయడం చాలా బాగుందని అన్నారు. అలాగే పాతతరం గిరిజనులు ఆస్వాదించిన గిరిజన వంటకాలు ఇప్పపువ్వు లడ్డులు, మిల్లెట్ బిస్కెట్లు చాలా అద్భుతంగా ఉన్నాయని తెలుపుతూ గిరిజనులు సంస్కృతిని అంతరించిపోకుండా కాపాడుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో చత్తీస్గడ్ బృందం సభ్యులు పపుల్ల వాసం, మ్యూజియం ఇంచార్జ్ వీరాస్వామి, నిర్వహకులు రాజేష్, కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

92
3639 views