logo

అరకు: చంద్రబాబు కు కృతజ్ఞతలు తెలిపిన సోమ కుటుంబ

2018 సెప్టెంబర్ లో మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుమారుడు సురేష్ కుమార్ ను కారుణ్య నియామకంలో డీటీ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యరాణి నేతృత్వంలో సోమ భార్య ఇచ్ఛావతి, తనయులు, కుటుంబ సభ్యులు విజయవాడ లో సిఎం చంద్రబాబు ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం తమకు అండగా ఉన్న సిఎం చంద్రబాబుకి, ప్రభుత్వానికి రుణపడి ఉంటామని మాజీ ఎస్సీ, ఎస్టీ కమీషన్ సభ్యుడు సివేరి అబ్రహాం అన్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషిచేయాలని చంద్రబాబు దిశానిర్ధేశం చేశారని అబ్రహాం పేర్కొన్నారు. గత తప్పిదాలు మరల తలెత్తకుండా ఉండాలని చంద్రబాబు సూచించినట్లు అబ్రహాం పేర్కొన్నారు.

1
89 views