logo

రైతులకు న్యాయమైన కనీస మద్దతు ధర (MSP) లభించే విధంగా ప్రభుత్వ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మద్దిశెట్టి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి

తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** దమ్మపేట మండలం** నవంబర్ 10** (ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)

భారతీయ యువ సేవ సంఘ్ కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షులు మద్దిశెట్టి సామేలు , కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు వినతి పత్రం పంపించడం జరిగింది.ఈ పత్రంలో మద్దిశెట్టి సామేలు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంగానీ, కేంద్ర ప్రభుత్వంగానీ పత్తి కొనుగోలు కేంద్రాలు లేకపోవడం వల్ల రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రైవేట్ దళారీలు, మధ్యవర్తులు పత్తిని చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయడానికి ప్రయత్నించడం రైతులను తీవ్రంగా నిరుత్సాహపరుస్తుందన్నారు. రైతులు ఏమి చేయలేని స్థితిలో నిజంగానే కళ్లలో నీళ్లతో బాధపడుతున్నారని ఆయన ఆవేదనతో తెలిపారు.ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, రైతులకు న్యాయమైన కనీస మద్దతు ధర (MSP) లభించే విధంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను తక్షణం ఏర్పాటు చేయాలని సామేలు కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు.

15
2499 views