logo

మీడియా రిలేషన్స్ పోర్టల్ ను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి కొలుసు పార్ధసారధి. #AIMA Suvarnaganti RaghavaRao Journalist

మీడియా రిలేషన్స్ పోర్టల్ ను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి కొలుసు పార్ధసారధి
• 2026-2027 రెండేళ్ళ కాలానికి అక్రిడిటేషన్లు జారీ
• మీడియా సంస్థల నుండి ధరఖాస్తులు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు 2026-2027 రెండేళ్ళ కాలపరిమతితో కూడిన అక్రిడిటేషన్లు జారీ చేసేందుకు సంబంధించి మీడియా రిలేషన్స్ పోర్టల్(వైబ్ సైట్)ను సోమవారం సమాచార పౌర సంబంధాలు,గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్ధసారధి లాంచనంగా ప్రారంభించారు. ఈమేరకు ఎపి సచివాలయం ప్రచార విభాగంలో జరిగిన మీడియా సమావేశంలో మీడియా రిలేషన్స్ వెబ్ సైట్ ను సమాచారశాఖ సంచాలకులు కెఎస్.విశ్వనాధన్ తోకలిసి ప్రారంభించారు.గతంలో జారీ చేసిన జర్నలిస్టుల అక్రిడిటేషన్ల గడువు ఈనెల 30వ తేదీతో ముగియనున్న నేపధ్యంలో రానున్న 2026-2027 రెండేళ్ల కాలానికి నూతన అక్రిడిటేషన్లు జారీకి వివిధ మీడియా సంస్థల్లో పనిచేసే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల నుండి ధరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతోంది.రాష్ట్ర మరియు జిల్లాస్థాయి అక్రిడిటేషన్లకై అర్హులైన మీడియా ప్రతినిధులు అందరూ ఈపోర్టల్ లో ధరఖాస్తు చేసుకోవచ్చును.ఈపోర్టల్ లో ధరఖాస్తు చేసుకున్న జర్నలిస్ట్ లు తమ అప్లికేషన్ స్టేటస్ ఏ దశలో ఉందో కూడా ఈవైబ్ సైట్ ద్వారా తెల్సుకోవచ్చును.ఈపోర్టల్ లో ఏవిధంగా ధరఖాస్తు చేసుకోవాలనే విధి విధానాలను మంగళవారం ప్రత్రికా ప్రకటన ద్వారా తెలియజేయడం జరుగుతుంది.

#ఆంధ్రప్రదేశ్ #APMediaRelations #కొలుసుపార్ధసారధి #జర్నలిస్టుమధ్యస్తత #మాధ్యమఅక్రిడిటేషన్ #APJournalists #MediaAccreditation2026
#APNews
#AksharaSanketham
#TeluguNews #PressPortal #MediaUpdates #JournalisminAP #MediaPortalLaunch #2026Accreditation #PrintMedia #ElectronicMedia

14
1627 views