logo

కోలా జోగులకు ఆపన్న హస్తము అందించిన శ్రీ శయన సంఘ....

విశాఖపట్నం (పెందుర్తి)

సుజాత నగర్ శ్రీ శయన సంఘ ప్రధాన కార్యాలయం లో ఒక మంచి కార్యక్రమానికి వేదిక అయింది.ఆపదలో ఉన్న కుటుంబానికి ఆదుకోవడం ఒక మంచి కార్యక్రమంగా చెప్పవచ్చు.శ్రీ శయన సంఘ కుటుంబ సభ్యులలో ఒకరైన కోలా జోగారావు గాజువాక పెద్ద గంట్యాడ వాస్తవ్యులు అతను చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి కమిటీ సభ్యులకు వారి కుటుంబ సభ్యులు కలిసి ఆర్థిక పరిస్థితి గురించి తెలియజేయడంతో కమిటీ సభ్యుల పిలుపుమేరకు సంఘం యొక్క కుటుంబ సభ్యులు,కమిటీ సభ్యులు తోచిన సహాయం చేయగా 25500/ రూపాయలు వచ్చినవి ఆ మొత్తాన్ని సుజాతనగర్ లో ఉన్న శ్రీ శయన సంఘ కార్యాలయంలో కమిటీ సభ్యులు మరియు సంఘ సభ్యులు సమక్షంలో కోలా జోగారావు సతీమణి భాగ్యలక్ష్మి కి సంఘ సభ్యులు చేతుల మీదగా అందజేయడం జరిగింది.భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మా కుటుంబాన్ని ఆదుకున్నందుకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదు. మా యొక్క కష్టం చెప్పిన వెంటనే సహాయం చేసినందుకు శ్రీ శయన కమిటీ సభ్యులకు శ్రీ శయన కుటుంబ సభ్యులకు రుణపడి ఉంటానని తెలియజేశారు.కమిటీ సభ్యులు మాట్లాడుతూ మన యొక్క శ్రీ శయన సంఘ కుటుంబ సభ్యులలో ఎవరైనా ఆపదలో ఉన్నా మన కమిటీ సభ్యులు దృష్టికి తీసుకువస్తే వారి యొక్క ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని. వారికి మన సంఘ సభ్యులతో మాట్లాడి తగిన విధంగా సహాయం చేసే దిశగా అడుగులు వేస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో శ్రీ శయన సంఘ సభ్యులు మరియు సంఘ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

0
109 views