logo

నల్ల బ్యాడ్జీలు ధరించి సోమవారం నాడు మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన

ADB:- మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు
పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నార్నూర్ మండల కేంద్రంలో ఏఐటీయూసీ నేత జాడె నాందేవ్ ఆధ్వర్యంలో సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి కార్మికులు నిరసన తెలిపారు. గత 25 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలు తీసుకుంటూ బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం అందిస్తూ కీలక పాత్ర వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

10
581 views