భూటాన్ లో జరగనున్న అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ అండ్ అథ్లెటిక్స్ పోటీలకు నాగజ్యోతి
ఎంపిక
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో
ఆంగ్ల ఉపాధ్యాయులు మరియు ప్రముఖ క్రీడాకారిణి శ్రీమతి పి.వి.ఎం. నాగజ్యోతి ఈ నెల 14 నుంచి 17 వరకు భూటాన్‌లో జరగబోయే SBKF( సంయుక్త భారతి ఖేల్ ఫౌండేషన్) ఆధ్వర్యంలో నిర్వహించబడే ఇంటర్నేషనల్ పవర్‌లిఫ్టింగ్ అండ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనబోతున్నారు.
నాగజ్యోతి ఇప్పటివరకు అనేక జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఎన్నో పతకాలు సాధించిన విషయం తెలిసిందే. క్రీడారంగంలో అద్భుత ప్రతిభ చూపిస్తూ తన పట్టుదలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఈసారి భూటాన్‌లో జరగబోయే ఈ అంతర్జాతీయ పోటీల్లో కూడా దేశానికి గౌరవం తెచ్చిపెట్టాలనే లక్ష్యంతో పాల్గొనబోతున్నారు.నాగజ్యోతి కి లయన్స్ క్లబ్, వాసవి క్లబ్ ప్రతినిధులు అధికారులు సభ్యులు, సహోపాధ్యాయులు, స్థానిక వార్డు సభ్యులు విజయాశీస్సులు తెలుపుతూ, భూటాన్‌లో జరిగే పోటీల్లో ఆమె మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.