logo

ఓజీ కుప్పం గ్రామంలో 1.25 కేజీల గంజాయి స్వాధీనం..



ఓజీ కుప్పం గ్రామంలో 1.25 కేజీల గంజాయి స్వాధీనం

తిరుపతి జిల్లా, నగరి నియోజకవర్గం:
నగరి మండలం ఓజీ కుప్పం గ్రామంలో అక్రమంగా గంజాయి విక్రయానికి పాల్పడిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరుమారియమ్మ గుడి సమీపంలో లింగేశ్వరీ @ జ్యోతి (వయస్సు: 47, భర్త: రాజు, ఓజీ కుప్పం గ్రామం) వద్ద నుండి 1.25 కేజీల గంజాయిను నగరి డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ ఆజీజ్ ఆధ్వర్యంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితురాలిని రిమాండ్ నిమిత్తం నగరి కోర్టుకు హాజరు పరచారు. ఆ మహిళపై గతంలోనే నగరి పోలీస్ స్టేషన్‌లో ఐదు గంజాయి కేసులు, అలాగే పుత్తూరు పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల డిప్యూటీ తహశీల్దారు మేఘవర్ణం, ఇన్స్పెక్టర్ విక్రమ్, ఎస్‌ఐ విజయ నాయక్, మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

83
4016 views