logo

శ్రీకృష్ణ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్* అశోక్ నగర్- కార్తీక మాస వనభోజనాల కార్యక్రమము....

తేదీ: 09-11-2025: శేర్లింగంపల్లి శేర్లింగంపల్లి చందానగర్, చందానగర్ :హరిహరాదులకు ప్రీతిపాత్రమైన కార్తీకమాసాన్ని పురస్కరించుకుని బీరంగూడా గుట్టమీద ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దేవాలయ ప్రాంగణంలో ఈరోజు వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఉదయము గం. 9.00 లకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అల్పాహారం అనంతరం ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. చిన్న పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. B గంగరాజు బృందంచే సినీ, లలితగీతాలు ఆలపించడం జరిగింది. అటు పిమ్మట మధ్యాహ్నము భోజన కార్యక్రమాదులు జరిగాయి. సాంస్కృతిక మరియు వినోద కార్యక్రమాలలో విజేతలైన వారికి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. చివరగా సాయంత్రం తేనీటి విందుతో కార్యక్రమం సుసంపన్నమైంది. శ్రీకృష్ణ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులైన జొన్నలగడ్డ బసవరాజు యాదవ్, డుక్కు వెంకటేశ్వర యాదవ్, డుక్కు శ్రీనివాస్ యాదవ్, రామాల రాజు యాదవ్, D హరిబాబు యాదవ్, N మధుయాదవ్, ఉదయ్ యాదవ్, N మోహన్ యాదవ్, సింగారయ్య యాదవ్, G E శివప్రసాద్ యాదవ్, ఆంజనేయులు యాదవ్, రాజు యాదవ్, పాములేటి యాదవ్, నందగోపాల్ యాదవ్, T C రామన్న యాదవ్, M రమేష్ యాదవ్, శ్రీనివాసరావు యాదవ్ మొదలైన వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వీర్ల ప్రకాష్ రావు యాదవ్, M రవికుమార్ యాదవ్, మెట్టుకుమార్ యాదవ్, బూరగడ్డ పుష్పా నాగేష్ యాదవ్, శంకర్ యాదవ్, తొంట అంజయ్య యాదవ్ తాడిబోయిన రామస్వామి యాదవ్, సుధాకర్ యాదవ్, R కుమార్ యాదవ్, K మానిక్ యాదవ్, గోపాల్ యాదవ్, బొబ్బిలి రాజా యాదవ్, మల్లేష్ యాదవ్, మారబోయిన రాజు యాదవ్, రవి యాదవ్, రఘు యాదవ్, సాయిరాం యాదవ్, యాదగిరి యాదవ్, శ్రీశైలం యాదవ్, అనిల్ యాదవ్, రాధాకృష్ణ యాదవ్, శ్రీధర్ యాదవ్, రమేష్ యాదవ్, ఐలేష్ యాదవ్, పరమేష్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ " *ఈ కార్తీకమాసంలో కార్తీకదీప ప్రజ్వలన మరియు వనభోజన కార్యక్రమాలు అనాదిగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సనాతన సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు శ్రీకృష్ణ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు పేరుపేరునా అభినందనలు* " అని తెలిపారు. " *యాదవ సోదర, సోదరీమణులందరూ సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెడుతున్న స్వయం ఉపాధి పథకాలను అందుకొని మహిళలు ఆర్ధిక ప్రగతి సాధించడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషనును మహిళలు ఉపయోగించుకొని అధిక సంఖ్యలో ఎన్నిక అయ్యేందుకు ప్రయత్నించాలి. యాదవ సోదర, సోదరీమణులందరు ఐక్యంగా ఉండి మిగిలిన B.C., S.C., S.T., మైనారిటీ వర్గాల వారిని కలుపుకొని నాయకత్వ లక్షణాలు పెంచుకొని, రాజ్యధికారానికై కృషి చేయాలి* " అని కోరారు. ఈ సందర్భంగా అతిథులకు నిర్వాహకులు పుష్పగుచ్ఛాలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో 1000 మంది సోదర, సోదరీమణులు పాల్గొన్నారు.

79
5917 views