
పత్తి , వరి రైతులు ప్రమాదంలో ఉన్నారు
కేంద్ర ప్రభుత్వం షరతులు విధించింది
తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా **బూర్గంపాడు మండలం**09/11/25
పత్తి , వరి రైతులు ప్రమాదంలో ఉన్నారు
కేంద్ర ప్రభుత్వం షరతులు విధించింది
ఇటీవల కురిసిన వర్షాలకు తెల్ల బంగారం రంగు మారిన విషయం తెలిసిందే ఇలాంటి విపత్తు సమయంలో రైతులకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది,
వర్షాలతో పత్తి పంటకు నష్టం కలిగిందని తెలియగానే విదేశీ దిగుమతులపై సుంకాలను ఎత్తివేసిన ఫలితంగా స్వదేశీ పత్తికి వరికి ధర లేకుండా పోయింది, పత్తి కొనుగోలు నుంచి కాటాన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సి సి ఐ ను తప్పించడమే లక్ష్యంగా కేంద్రం ప్రభుత్వం చర్యలు ఉంటున్నాయని విమర్శలు
వెలు వెత్తుతున్నాయి
ఈ చర్యల వల్ల పత్తి పండించే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అని సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు బిజెపి ఎంపీలు దీనిపైన మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు మరో మంత్రి కేంద్రం విధించిన నిబంధనాన్ని సమర్థిస్తూ ప్రకటనలు చేయటాన్ని,
తీవ్రంగా సిపిఎం పార్టీ ఖండించారు
ఎకరానికి
ఏడు క్వింటాల పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తామని నిబంధనం తీసుకొచ్చింది దీంతో మిగతా పత్తిని రైతులు ఎక్కడ అమ్ముకోవాలని దానికి ప్రభుత్వం వద్ద సమాధానం లేదు కేంద్ర ప్రభుత్వం రైతుల పక్షాన లేదు
కార్పొరేట్ శక్తులకి అనుకూలమైన విదేశీ పత్తిని స్వదేశీలోకి తీసుకొచ్చి తెలంగాణలో పత్తి వరి పండించే రైతులకు ఓరి బిగిస్తున్న కేంద్ర ప్రభుత్వం
ఈనిబంధనలను రైతులు వ్యతిరేకించాలని కేంద్ర బిజెపి ప్రభుత్వం విధానానికి రైతులు అందరూ ముందుకు రావాలని అన్నారు, ఇలాంటి ప్రభుత్వం రైతులకు కార్మికులకు వ్యాపారస్తులుకు ఏ ఒక్కరిని వదిలి పెట్టకుండా సుంకాలు మన దేశంలో విధించింది విదేశీ వస్తువుల్ని దిగుమతి చేసుకోవడం మన దేశంలో పండిస్తున్న రాష్ట్రంలో పండిస్తున్న వరి పంట పత్తి పంటలు పండించ కుండా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుందని తెలిపారు,విదేశీయుల కోసం రైతుల్ని బలిపశులు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రజలు రైతులు మేలు కోకపోతే రానున్న కాలంలో విదేశీయులకు బానిసలు లాగా మనమంతా ఉండాల్సిన అవసరం వస్తుందని తెలిపారు