logo

మొక్కజొన్న, వరి పంట కు మద్దతు ధర, కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి.

నంద్యాల:ఆళ్లగడ్డ నియోజకవర్గం పరిధిలోని ఆళ్లగడ్డ ఏడిఏ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీ అనగా బుధవారం ఉదయం11గంటలకు ధర్నాలో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పిలుపు నిచ్చింది. వివరాల్లోకి వెళితే రుద్రవరం, సిరివెల్ల,ఆళ్లగడ్డ,చాగలమర్రి మండలాల్లోమొక్కజొన్న, వరి,మిరప,మినుము, బొప్పాయి మొదలగు పంటల సాగు చేసి అధిక వర్షాలు,తుఫాను ప్రభావం వల్ల తీవ్రంగా పంట నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలని, మిగిలి ఉన్న మొక్కజొన్న, వరి పంటలను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకు కొనుగోలు చేయుటకు వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీ అనగా బుధవారం ఉదయం11గంటలకు ఆళ్లగడ్డ వ్యవసాయ శాఖ ADA కార్యాలయం వద్ద జరుగు ధర్నాలో నియోజకవర్గం లోని రైతులందరూ రాజకీయాలకతీతంగా పాల్గొని ధర్నానుజయప్రదం చేయవలసింది కోరుతూ రుద్రవరం మండలం లోనీ కొత్తూరు,కోటకొండ యల్లావత్తుల,శ్రీరంగాపురం, పెద్ద కంబలూరు,అప్పనపల్లి, రుద్రవరం గ్రామాల్లో కరపత్రాలద్వారా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ప్రచారం నిర్వహించారు. అనంతరం రుద్రవరం మండల కేంద్రం సమీపంలో కొండ మాయ పల్లె వద్ద ఆరబోసిన మొక్కజొన్నలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి టి. రామచంద్రుడు, సంఘంమండల అధ్యక్షులు T. గుర్రెడ్డి, మండల నాయకులు వై మద్దిలేటి, తలారి పరమేశ్వరుడు, మల్లికార్జున, బాల నరసింహుడు, మహమ్మద, హుసేనితో పాటు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి టి. రామచంద్రుడు మాట్లాడుతూ వదలను బొమ్మాళి అన్నట్లు వర్షం రైతులను వెంటాడుతుంది. పాలకులు కరుణించడం లేదు.రైతులపట్ల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తూ,తాము చేసిన మద్దతు ధరలు అమలు జరపడం లేదు.కనీసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరితే ఇదిగోబొమ్మ ఇదుగో బొమ్మ అన్న చందంగా కాలయాపన చేయడం వల్ల రైతులు మధ్య దళారుల చేతుల్లో నష్టపోతున్నారు. తూకాల్లో మోసం, రేట్లలో తగ్గుదల.2400 రూ కొనుగోలు చేయాల్సిన మొక్కజొన్న కేవలం 1700 రూ లకు అమ్ముకొని నష్టపోతున్నారు. ఒకవైపు పంట నష్టపరిహారం ఇవ్వరు. మరోవైపు కొనుగోలు కేంద్రాలు పెట్టరు మద్దతు ధరలు అమలు జరపరు. కానీ రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. మొక్కజొన్న పంట కోత ప్రారంభమై నెల రోజులు అవుతుంది. వరి పంట కూడా కోత దశకు వచ్చింది.అందువల్లనే రైతులందరూ రాజకీయాలకతీతంగా కలిసికట్టుగా ప్రభుత్వాన్ని కదిలించడం కోసం నవంబర్ 12న ఆళ్లగడ్డలో జరుగు ధర్నాలో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం టి. జిల్లా కార్యదర్శి రామ చంద్రుడు
విజ్ఞప్తి చేశారు.

21
1737 views