logo

కలం వీరులకు అభినందన మాల. ఘనంగా ఆర్యవైశ్య జర్నలిస్టుల సన్మాన కార్యక్రమం వాసవి ఇంటర్నేషనల్ క్లబ్.

సమాజ నిర్మాణంలో జర్నలిస్టుల పాత్ర అమూల్యం— ఆర్‍టి‌ఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డిసికింద్రాబాద్:
సమాజ నిర్మాణంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమని సమాచార హక్కు (RTI) కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి అన్నారు.
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లో జరిగిన 'కలం యోధులకు అభినందన మందారమాల' పేరిట జరిగిన ఆర్యవైశ్య జర్నలిస్టుల సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.జర్నలిజం వృత్తి ఎంతో ఉత్కృష్టమైందని, కష్టానికి తగిన ఫలితం తక్కువైనా సమాజం పట్ల నిబద్ధతతో పనిచేస్తున్న జర్నలిస్టులు ప్రశంసించదగ్గవారని ఆయన పేర్కొన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తీసుకున్న ఈ సన్మాన యజ్ఞం జర్నలిస్టుల బాధ్యతను మరింత పెంచుతుందని ఆయన అన్నారు.ఆర్య వైశ్య జర్నలిస్టులు మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు వారసుల్లా సమాజ సంక్షేమానికి కృషి చేయాలన్న పిలుపునిచ్చారు.వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అధ్యక్షుడు ఇరుకుల్ల రామకృష్ణ మాట్లాడుతూ, వాసవి క్లబ్ అన్ని వర్గాలకు సేవలు అందిస్తూ అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోందని వివరించారు. పేదల అభ్యున్నతి కోసం పథకాలు అమలు చేయడంతోపాటు సైన్యానికి సైతం విరాళాలు అందిస్తున్నట్లు తెలిపారు.జర్నలిస్టులు సమాజ నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారని, వారి సేవలను గుర్తిస్తూ వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ఈ సన్మాన కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఆనందంగా ఉందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వందలాది ఆర్యవైశ్య జర్నలిస్టులు హాజరై ఈ వేడుకకు విశిష్టత చేకూర్చారు.కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రతినిధులు దోసపాటి వెంకటేశ్వరరావు, సిద్ధ సూర్య ప్రకాష్ రావు, బోడ సూర్య ప్రకాష్, గార్లపాటి శ్రీనివాసులు, సుజాత రమేష్ బాబు మాట్లాడారు. సీనియర్ జర్నలిస్ట్ అంజయ్య, WJI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.జర్నలిస్టులందరికీ RTI కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఇరుకుల్ల రామకృష్ణ చేతుల మీదుగా “వాసవి మీడియారత్న పురస్కారాలు” ప్రదానం చేశారు.మొత్తం 300 మంది ఆర్యవైశ్య జర్నలిస్టులు సన్మానితులయ్యారు. ప్రతి జర్నలిస్టుకు లయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో సర్టిఫికేట్, 1,116 రూపాయల సింబాలిక్ చెక్ ఇవ్వడం జరిగింది. ఈ అద్భుతమైన కార్యక్రమ విజయాన్ని సాధ్యంచేసిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్‌కు అందరూ అభినందనలు తెలిపారు

11
672 views