logo

కార్తీక పౌర్ణమి సందర్భంగా భూలోకమాతా అమ్మవారికి ప్రత్యేక పూజలు

చీపురుపల్లి: మండలంలోని అలక నారాయణపురం గ్రామంలో వెలిసిన శ్రీ భూలోకమాతా అమ్మవారికి బుధవారంనాడు కార్తీక పౌర్ణమి మహా పర్వదినం సందర్భంగా ప్రత్యేక అభిషేకములు, సహస్ర కుంకుమ అర్చన,లలిత హోమం, గొల్లలములగాం వాస్తవ్యులు ప్రముఖ సుందరకాండ ఉపన్యాస పరులు రేజేటి.రామకృష్ణ శర్మ గారు వేద మంత్రాలతో వైభవంగా జరిపించారు. . ఈ కార్యక్రమంలో అత్యధిక భక్తులు పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తలు సాగిరాజు.అప్పల నర్సింహవర్మ గారు సోదరులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయం అర్చకులు రేజేటి.కార్తీక్ శర్మ గారు మాటలాడుతు ,ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు అమ్మవారికి అభిషేకం తదుపరి కుంకుమ పూజలు జరుగుతాయని ..భక్తులు పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాలని సూచించారు.

18
2540 views