విస్సన్నపేట: పెట్రోల్ బంక్ లో అగ్ని ప్రమాదం
విస్సన్నపేట: పెట్రోల్ బంక్ లో అగ్ని ప్రమాదం విస్సన్నపేట నూజివీడు రోడ్డులోని ఓ పెట్రోల్ బంక్లో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బంక్లో ఉన్న జనరేటర్ సెట్కు మంటలు అంటుకున్నాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని నిర్వాహకులు పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.