చందానగర్లో యన్ హెచ్ 65 పైన క్రాస్ వాకింగ్ కొరకు విజ్ఞాపన పత్రం సమర్పించుట....
ఈరోజు ఏసిపి వెంకటయ్య గారు ట్రాఫిక్ కూకట్పల్లి.గారిని మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ విద్యాసాగర్ రెడ్డి గార్లను కలిసి, పూణే- హైదరాబాద్.ఎన్ హెచ్-65 మీద చందానగర్ లో క్రాస్వాక్ ఏర్పాటు చేయాలని విజ్ఞాపన పత్రం సమర్పించడం జరిగింది. చందానగర్ వాసులు రోడ్డుకు ఇటు నుంచి అటువైపు గాని, అటు నుంచి ఇటువైపు గాని రావడానికి, పోవడానికి, వృద్ధులు, మహిళలు,విద్యార్థినీ విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నారు. వారి అవస్థలను దృష్టిలో ఉంచుకొని, క్రాస్వాక్ ఏర్పాట్లు చేయవలసిందిగా కోరడమైనది. వారు సానుకూలంగా స్పందించి, త్వరలో చర్యలు చేపడుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాలం శ్రీను పాల్గొన్నారు.
ఇట్లు
బుధజన విధేయుడు తాడి బోయిన రామస్వామి యాదవ్
మాజీ కౌన్సిలర్,ఫ్లోర్ లీడర్. శేరిలింగంపల్లి పురపాలక సంఘం.