
ప్రముఖ స్టార్ హోటల్స్ యాజమాన్యం తో.. పోలీసులు ఒప్పందం..!!!! MoU..
AIMA MEDIA :NOV 3:MONDAY :విశాఖపట్నం
ఐమా న్యూస్ 9:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటి, MoU ఒప్పందం అంగీకారం పై పోలీస్ శాఖ మరియు విశాఖపట్నం హోటల్స్ యాజమాన్యం మధ్యలో ఒక ఒప్పందాం కుదుర్చుకున్నాం అని నగర పోలీస్ కమీషనర్ పి ఎస్, భగీచి తెలిపారు. వివరాలు లోకి వెళ్తే
విశాఖపట్నం సిటీ,
తేదీ 02-11-2025.
*ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమెదటిసారిగా స్టార్ హోటల్స్ తో అవగాహన ఒప్పందాలు (MOUs) చేసుకున్న విశాఖపట్నం నగర పోలీసులు*
*నగర పోలీసు కమిషనర్ గారి చొరవతోవిశాఖ నగర పోలీస్ మరియు స్టార్ హోటల్స్ మధ్య ఐ.పీ.ఎస్ అధికారుల ఆతిథ్య (హాస్పిటాలిటీ) ఏర్పాట్లకు సంబంధించిన అవగాహన ఒప్పందాలు (MOUs)*
ఉద్దేశ్యం మరియు ఏర్పాట్లు:
7వ వేతన సంఘం (7th Pay Commission) సిఫార్సుల ఆధారంగా, హోం మంత్రిత్వ శాఖ (MHA) ఐపీఎస్ అధికారులకు 09 నుండి 15 స్థాయిల మధ్య వేతన శ్రేణులను నిర్ణయించింది. ఈ వేతన శ్రేణి ప్రకారం, ప్రభుత్వం నిర్దేశించిన ప్రయాణ భత్యం (TA) నిబంధనలకు అనుగుణంగా, ఐపీఎస్ అధికారుల ఆతిథ్య ఏర్పాట్లు విశాఖపట్నం నగరంలోని నియమించబడిన హోటల్స్ ద్వారా సమకూర్చబడతాయి.
వేతన శ్రేణుల ఆధారంగా సేవలు:
ఈ సేవలు మూడు వేతన శ్రేణి వర్గాల ఆధారంగా విస్తరించబడతాయి:
ASP నుండి SP వరకు: వేతన శ్రేణి 9 నుండి 11
SSP నుండి DIG వరకు: వేతన శ్రేణి 12 నుండి 13
IGP నుండి DGP వరకు: వేతన శ్రేణి 14 మరియు అంతకంటే ఎక్కువ
రాష్ట్ర డి.జి.పి శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐ.పి.ఎస్., గారు, నగర సీపీ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, హోటళ్ళ ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమం విశాఖపట్నం సిటీ పోలీస్ మరియు హోటల్స్ మధ్య మొట్టమొదటిసారిగా అవగాహన ఒప్పందాల (MoU) సంతకానికి నాంది పలికింది. ఈ సహకారం ఆతిథ్య పరిశ్రమతో (hospitality industry) సమన్వయంతో కూడిన ఒక ప్రత్యేకమైన మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని హైలైట్ చేస్తుంది, సంస్థాగత సంబంధాలను బలోపేతం చేయడమే దీని లక్ష్యం.
నగర పోలీసు తరపున,
విశాఖపట్నం సిటీ.