నష్టపోయిన పంటల వివరాలను త్వరగా నివేదికను అందజేయాలి
జర్నలిస్ట్: ఆకుల గణేష్
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, భారీ వరదల కారణంగా నష్టపోయిన పంటల వివరాల అంచనాను వ్యవసాయ అధికారులు త్వరగా పూర్తి చేసి నివేదికను అందజేయాలని ఆదేశించారు. హసన్ పర్తి మండలం వంగపహాడ్ రెవెన్యూ గ్రామ పరిధిలో వరదలతో నష్టం జరిగిన వరి పంట పొలాలను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద ముంపు ప్రభావంతో ఏయే పంటలకు ఎంతెంత నష్టం జరిగిందనే వివరాలను వ్యవసాయ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.