సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహన యత్నం
జర్నలిస్ట్: ఆకుల గణేష్
రేగొండ మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా 'ఆపరేషన్ సింధూరం'పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఈ చర్య చేపట్టారు. ఆయన వ్యాఖ్యలు సైన్యాన్ని, దేశాన్ని అవమానించేలా ఉన్నాయని, తక్షణమే క్షమాపణ చెప్పాలని బిజెపి డిమాండ్ చేసింది.