పారదర్శకంగా వాస్తవ సమాచారాన్ని నమోదు చేయాలి: మేయర్
జర్నలిస్ట్: ఆకుల గణేష్
వరద ప్రభావంతో నష్టపోయిన గృహాలు, కోల్పోయిన వస్తువులకు సంబంధించిన వాస్తవ సమాచారాన్ని పారదర్శకంగా నమోదు చేయాలని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. ఆమె 28వ డివిజన్‌లో క్షేత్రస్థాయిలో పర్యటించి, కొనసాగుతున్న సమాచార నమోదు ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు