logo

చిత్తూరు జిల్లా కేంద్రంగా, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా

చిత్తూరు జిల్లా కేంద్రంగా, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కార్యవర్గం నిర్ణయించింది.
జిల్లా అధ్యక్షులు ప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం చేస్తున్న యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈనెల 5న నిర్వహించాలని నిర్ణయించారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ వేడుకలు చేపట్టాలని చర్చించారు.
ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన యూనియన్, బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని తీర్మానించింది.
సమావేశానంతరం, కొత్తగా ఉపాధి హామీ పథకం అంబుడ్స్‌మెన్‌గా నియమితులైన మాజీ కన్వీనర్ కడియాల వరదరాజును జర్నలిస్టులు సన్మానించారు.
కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు కవరకుంట్ల జయరాజ్, జిల్లా గౌరవాధ్యక్షుడు గంగాధరం, జయచంద్ర చిన్న, కృపానందరెడ్డి, దినేష్ కుమార్, యాదవేందర్ రెడ్డి, మురళి, మురళీకృష్ణ, సురేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

4
519 views