logo

లింగంపల్లి రైల్వేస్టేషను మీదుగా దూర ప్రాంతాలకు వెళ్ళే కొన్ని రైళ్ళను లింగంపల్లి రైల్వే స్టేషనులో ఆపుతున్నందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులకు కృతజ్ఞతలు

తేదీ :01-11-2015:శేర్లింగంపల్లి,చందానగర్,హైదరాబాదు మహానగరంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం శేరిలింగంపల్లి. ఈ ప్రాంతం పారిశ్రామిక, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వైద్య (కార్పోరేట్ హాస్పిటల్స్) మరియు విద్య (HCU, IIIT, Urdu University, ISB, ESCI, Open University, NITHAM, RTTC, NIFT) మొదలైన వాటికి నిలయంగా ఉన్నది. భారతదేశ నలుమూలల నుండి వచ్చి ఇక్కడ ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తము స్థిర నివాసము ఏర్పరచుకున్న వారు చాల ఎక్కువ. ఇక్కడి వారు దూర ప్రాంతాలకు వెళ్ళి, రావడానికి సికింద్రాబాదు రైల్వే స్టేషనుకు వెళ్ళవలసి వచ్చేది. దీనితో సమయము, ధనము వృథా అవ్వడమే కాకుండా ప్రయాణికులు అనేకమార్లు వారు ఎక్క వలసిన రైళ్ళను సకాలంలో అందుకోలేక పోయిన సందర్భాలు అనేకం జరిగాయి. ఈ ప్రాంత ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని లింగంపల్లి రైల్వేస్టేషన్ మీదుగా రాకపోకలు సాగించే కొన్ని రైళ్ళను లింగంపల్లి రైల్వేస్టేషన్ లో ఆపాలని అనేక పర్యాయాలు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులకు విజ్ఞాపనలను సమర్పించడం జరిగింది. వారు సానుకూలతతో పరిశీలించి, స్పందించి కొన్ని రైళ్ళను ఈరోజు నుండి (01-11-2025 శనివారం) లింగంపల్లి రైల్వేస్టేషన్ లో ఆపుతున్నందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ప్రయాణికుల పక్షాన శతధా కృతజ్ఞతలు.
నేటి నుండి లింగంపల్లి రైల్వేస్టేషన్ లో ఆగే రైళ్ళ వివరాలు
1. సికింద్రాబాదు నుండి రాజ్ కోట్ ఎక్స్ ప్రెస్ మరియు రిటర్న్, వారానికి మూడు రోజులు (సోమ, మంగళ, శనివారాలు)
2. సికింద్రాబాదు నుండి పోరుబందరు మరియు రిటర్న్, వారానికి ఒకరోజు (బుధవారం).
3. సికింద్రాబాదు నుండి పూనే శతాబ్ధి ఎక్స్ ప్రెస్ మరియు రిటర్న్, వారానికి ఆరురోజులు (మంగళవారం మినహా).
4. హైదరాబాదు నుండి ముంబాయి హుసేన్ సాగర్ ఎక్స్ ప్రెస్ మరియు రిటర్న్, అన్ని రోజులు.
5. సికింద్రాబాదు నుండి తిరుపతి పద్మావతి ఎక్స్ ప్రెస్ వారానికి రెండు రోజులు (బుధవారం, శనివారం) మరియు రిటర్న్ (సోమవారం, బుధవారం).
ఈ సందర్భంగా సంబంధిత అధికారులందరికీ పేరుపేరునా మరియొక మారు కృతజ్ఞతలు.
ఇట్లు
బుధజన విధేయుడు
తాడిబోయిన రామస్వామి యాదవ్
మాజీ కౌన్సిలర్ మరియు ఫ్లోర్ లీడర్
శేరిలింగంపల్లి పురపాలక సంఘం.

341
17934 views