శ్రీ విశాలాక్షి కాశీ విశ్వేశ్వర మృత్యుంజయ ఆలయంలో తొలి ఏకాదశి పూజలు పోటెత్తిన భక్తులు
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రోలుగుంట గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ విశాలాక్షి కాశీ విశ్వేశ్వర మృత్యుంజయ ఆలయంలో కార్తీకమాసంలో వచ్చిన తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. భక్తులు తెల్లవారుజాము నుంచే భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం జరిగింది. ఆలయ కమిటీ వారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కరగకుండా చర్యలు తీసుకున్నారు. కమిటీ ధర్మకర్త అయిన గురు స్వామిపిల్లి చిన్నరావుస్వామి మాట్లాడుతూ కార్తీకమాసం అంటే శివునికి ప్రత్యేకమైన రోజులని ఈ రోజులలో శివునికి ప్రతిరోజు పూజలు చేయడం వలన ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుందని కార్తీకమాసం ప్రతిరోజు కూడా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే ఈనెల 5వ తారీఖు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని లక్ష దీపారాధన కార్యక్రమం ఉంటుందని భక్తుని కార్యక్రమంలో అచ్యుతకంగా పాల్గొని కోరారు. ఈనెల 18వ తారీఖున శివాలయంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం జరుగుతుందని, అనంతరం అన్న సమారాధన కార్యక్రమం ఉంటుందని భక్తులు కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని అన్నసంతర్పణలో స్వామివారి ప్రసాదం తీసుకొని స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు.