logo

రేవంత్ రెడ్డిపై మండిపడ్డ వరంగల్ ప్రజలు

జర్నలిస్ట్: ఆకుల గణేష్

వరంగల్ లో తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల వల్ల ముంపునకు గురైన వరంగల్ పోతన నగర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద ప్రాంతాల్లో పర్యటించి, ప్రజలను ఆదుకుంటామని కూడా చెప్పకుండా వెళ్లిపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ప్రచార ఆర్భాటం కోసమే ముఖ్యమంత్రి పర్యటన సాగిందని, ప్రజలతో కనీసం మాట్లాడటానికి కూడా సమయం కేటాయించలేదని మహిళలు మండిపడ్డారు.

0
0 views