logo

భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (ఐక్యతా దినోత్సవం) మరియు భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి...

తేదీ: 31-10-2025: శేరిలింగంపల్లి,చందానగర్ ఈరోజు ఉదయము శేరిలింగంపల్లి మండల విద్యాధికారి కార్యాలయం ప్రక్కన గల భవిత కేంద్రంనందు వల్లభాయ్ పటేల్ గారి జయంతి మరియు ఇందిరాగాంధీగారి వర్ధంతి కార్యక్రమం ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో పుష్పాంజలి ఘటించి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి వెంకటయ్యగారు విచ్చేసి విద్యార్థిని, విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, ఎరేజర్లు, బిస్కెట్లు, పాప్ కార్న్ ప్యాకెట్లు మొదలగునవి పంపిణీ చేసి తదనంతరం మాట్లాడుతూ " *వల్లభాయ్ పటేల్ గారు న్యాయవాదిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరియు ప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టిన మహోన్నతుడు* " అని కొనియాడారు. " *ఆయన భారత రాజ్యాంగ రచనలో ముఖ్యపాత్ర పోషించారు. ప్రాథమిక హక్కుల కమిటీకి ఛైర్మెన్ గా కూడా వ్యవహరించారు. వారిని మహాత్మాగాంధీగారు _సర్దార్_ అనే బిరుదుతో సత్కరించారు. ఆయన స్వాతంత్ర్యానంతరం 500 లకు పైగా స్వదేశీ సంస్థానాలు ఇండియన్ యూనియన్ లో విలీనం కావడానికి కీలక పాత్ర పోషించారు. అలాగే జనాఘడ్, హైదరాబాదు లాంటి సంస్థానాలను ఇండియన్ యూనియన్ లో విలీనం చేసిన ఘనత వారిదే* " అని పేర్కొన్నారు. " *భారత ప్రభుత్వంలో ఉప ప్రధానిగా మరియు కేంద్ర హోం శాఖామాత్యులుగా ఈ దేశానికి విశేషమైన సేవలు అందించారు. ఆయనను ఆధునిక అఖిల భారత సర్వీసుల స్థాపకుడిగా పిలుస్తారు. ఆయన అందించిన సేవలకు భారత ప్రభుత్వం _భారతరత్న_ బిరుదుతో సత్కరించడంతో పాటు ఆయన జన్మదినాన్ని జాతీయ ఐక్యతా దినోత్సవంగా పాటిస్తున్నారు. పేదల పెన్నిధి బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతియైన శ్రీమతి ఇందిరాగాంధీగారు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా మరియు అలీన దేశాల అధ్యక్షురాలిగా ఈ దేశానికి మరియు అలీన దేశాలకు విశేషమైన సేవలు అందించారు* " అని కొనియాడారు. " *ఆవిడ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రాజ భరణాలు రద్దుతో పాటు బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. ఆవిడ మన దేశం రక్షణరంగంలో పటిష్టత పొందడం కొరకు అణుపరీక్షలు నిర్వహించడాన్ని ప్రోత్సహించారు. ఆవిడ ఉగ్రవాదాన్ని, వేర్పాటు వాదాన్ని కఠినంగా అణచి వేశారు. పూర్వపు తూర్పు పాకిస్తాన్ నేటి బంగ్లాదేశ్ ఏర్పడటానికి కారకులయ్యారు. పేదల సంక్షేమానికి 'గరీబీ హటావో' నినాదంతో 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టి ఈ వర్గాల సంక్షేమానికి కృషి చేసిన ధీరవనిత"* అని కొనియాడారు. " *ఆవిడ మన దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి. ఆవిడ ఉక్కుమహిళగా పేరుగాంచారు. ప్రపంచంలోనే ద్వితీయ మహిళా ప్రధానమంత్రిగా ఖ్యాతి గడించారు. ఆవిడ ప్రపంచస్థాయిలో శక్తివంతమైన నాయకురాలిగా పేరుగాంచారు. పటేల్ గారు మరియు ఇందిరాగాంధీ జీవితాలను ఆదర్శంగా తీసుకొని నేటి యువత ధైర్యముగా సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలి"* తెలిపారు. ఈ సందర్భంగా అందరిచేత ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ, అమ్మయ్య చౌదరి, ప్రేమ్ సింగ్, కృష్ణ మరియు స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి వెంకటరమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

188
10658 views