logo

వైయస్సార్సీపి మైనార్టీ నాయకులు చాంద్ బాష ను పరమర్శించిన మాజీ ఎమ్మెల్యే.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ప్రముఖ విద్యావేత్త మైనార్టీ నాయకులు చాంద్ భాషా గారు బెంగళూరు లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స నిమిత్తము మూడు రోజుల క్రితం వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ధర్మవరం మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తన అనుచరులతో బెంగళూరు వెళ్లి మైనార్టీ నాయకుడు కొత్తపేట చాంద్ బాష యోగక్షేమాలు అడిగి ఆయనకు ధైర్యం చెప్పి నట్లు తెలుస్తోంది. ధర్మవరం పట్టణానికి చెందిన పలువురు వ్యాపారవేత్తలు డాక్టర్లు మేధావులు విద్యార్థి నాయకులు బెంగళూరు వెళ్లి చాంద్ భాషా ని పరామర్శించడం జరిగింది. ఆయన త్వరగా కోలుకోవాలని మైనార్టీలు ప్రత్యేకంగా ప్రార్థించారు. ధర్మవరం నియోజకవర్గం మైనార్టీ నాయకులు పిఎంజెడ్ సాధిక్ బాష. కాంట్రాక్టర్ ఖాదర్ వలీ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పి నాగరాజు. మాసపల్లి సాయికుమార్ గజ్జల శివ తదితరులు ఆయన యోగక్షేమలు అడిగి తెలుసుకున్నారు.

108
2364 views