logo

ధర్మవరం మున్సిపాలిటీలో కుక్కలకు 18 లక్షలు ఖర్చు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పురపాలక సంఘం సమావేశం గురువారం మున్సిపల్ చైర్మన్ శ్రీమతి కాచర్ల లక్ష్మి గారి ఆధ్వర్యంలో జరిగింది.
ధర్మవరం పట్టణంలో విచ్చలవిడిగా ఏ వార్డులో చూసిన ఏ సందులో చేసిన కుక్కలు అధికంగా ఉన్నాయని వాటిని అరికట్టేందుకు వాటి సంతాన ఉత్పత్తిని జరగకుండా చర్యలు తీసుకునేందుకు 18 లక్షలు ఖర్చు పెట్టారని అది ఎక్కడ ఖర్చు పెట్టారు తెలియజేయాలని పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ తో వాదనకు దిగారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ జయరాం రెడ్డి మాట్లాడుతూ కుక్కలకు 18 లక్షలు ఖర్చు చేయడం విడ్డూరంగా ఉందని తెలిపారు. మున్సిపల్ వాహనాలకు ఖర్చు చేసే డీజిల్ ల్లో కూడా అవినీతి జరిగిందని పత్రికల్లో వార్తలు వచ్చాయని దీనిపైన కూడా అధికారులు స్పందించలేదని పేర్కొన్నారు అలాగే అధికార కార్యక్రమాలకు రోడ్డు కిరువైపులా వేసే సున్నం లో కూడా అవినీతి జరిగిందని ప్రజాధనం వృధాగా ఖర్చు అవుతుందని ఆయన వాపోయారు. రాజకీయ పార్టీల ప్రచార కార్యక్రమాల కోసం పుట్టినరోజులు ప్రచారం కోసం ధర్మవరం పట్టణంలోని ప్రధాన వీధుల్లో రోడ్డుకిరువైపులా పెక్సీలు కడుతున్నారని దీనివల్ల మున్సిపాలిటీకి ఎంత ఆదాయం వచ్చిందో అధికారులు తెలియజేయాలని కోరారు. అలాగే వైయస్సార్సీపి పార్టీ పెక్సీలను రెండు రోజుల్లోనే తొలగిస్తున్నారని కూటమి పాలకుల నాయకుల పెక్సీలు నెలల తరబడి ఉంచుతున్నారని దీనివల్ల మున్సిపాలిటీకి ఆదాయం వస్తే మంచిదే అన్నారు కానీ ఆదాయం రాకుండా నిబంధనలకు విరుద్ధంగా పెక్సీలు కడితే తొలగించాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లు చందమూరి నారాయణరెడ్డి మాసపల్లి సాయికుమార్ భాగ్యలక్ష్మి కత్తే ఆదిలక్ష్మి జిలాన్ భాష తదితరులు ప్రసంగించారు. అధికారుల అవినీతిపై రాష్ట్ర మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని అవినీతిపై విచారణ జరపాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు.

81
3865 views