శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాస రాట మహోత్సవానికి MLA కి ఆహ్వాన పత్రిక అందజేసిన ఈవో....
విశాఖపట్నం(బురుజుపేట)
శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో లో వచ్చే నెలలో జరిగే మార్గశిర మాస మహోత్సవములు సందర్భంగా నవంబర్ ఒకటవ తేదీన జరిగే రాట మహోత్సవ వేడుకకు దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆలయ ఈవో శ్రీమతి శోభారాణి ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ సందర్భంగా నవంబర్ ఒకటో తేదీన ఉదయం 10 గంటలకు ఈ వేడుక జరగనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ మునిపెన్నడూ లేని విధంగా అమ్మవారి మార్గశిర మాస మహోత్సవములో ఘనంగా జరిగే విధంగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి,తీర్థ ప్రసాదములు అందజేశారు.కార్యక్రమంలో ఆలయ ఈఓ ఆనందకుమార్, ఈ ఈ రమణ, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్,ఆలయ క్లర్క్ ప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు.