logo

నాగూర్ బాబు

నాగూర్ బాబు సత్తెనపల్లి లోని ఓ ముస్లిం కుటుంబంలో జన్మించారు. వారి తల్లి షహీదా, తండ్రి రసూల్. తండ్రి ఆలిండియా రేడియోలో పనిచేసేవారు. నేదునూరి కృష్ణమూర్తి దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. గాయకుడిగా పరిచయమవక ముందే "నీడ" అనే చిత్రంలో బాలనటుడిగా కనిపించారు. ఇళయరాజా ఆయన పేరును మనోగా మార్చారు.ముత్తు (1995) నుండి తెలుగులో రజనీకాంత్ కోసం పూర్తి స్థాయి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా మనో గుర్తింపు పొందారు.
......
మనో గారి సోదరుడు తబలా వాద్యకారుడు. అతన్ని సంగీత దర్శకులు చక్రవర్తి దగ్గర చేరుద్దామని చెన్నై తీసుకెళ్ళాడు. వాళ్ళ ప్రతిభను గుర్తించిన ఆయన అక్కడే సహాయకుడిగా ఉండిపొమ్మన్నాడు. ఆయన దగ్గర పనిచేయడం ద్వారా నేపథ్యగానంలో మెళకువలు సంపాదించాడు. తెలుగులో నాగూర్‌బాబుగా, తమిళంలో మనోగా సుపరిచితులు.గాయకుడిగా ఆయన మొదటి పాట మురళీ మోహన్ జయభేరి పతాకం మీద తీసిన కర్పూరదీపం అనే సినిమా లోది.
.......
రజనీకాంత్ తెలుగు చిత్రాలకు ఆయనకు గాత్రదానం ( డబ్బింగ్ ) చేసి ఆయన మెప్పు పొందారు. బుల్లితెర పై పలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. తెలుగు, తమిళము, మళయాలం సంగీత పాటల కార్యక్రమాలకు ఇంకా కామెడీ కార్యక్రమం జబర్థస్త్ కూడా జడ్జిగా వ్యవహరిస్తుంటారు. నలభై-ఎనిమిదేళ్ల పాటు సాగిన కెరీర్‌లో అత్యంత ఫలవంతమైన స్వరకర్తలలో ఒకరిగా పరిగణించబడుతున్న మనో 7,000 పాటలకు పైగా కంపోజ్ చేసారు. 20,000 కంటే ఎక్కువ కచేరీలలో జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రదర్శనలు చేసారు.
• వాయిస్ ఓవర్ డబ్బింగ్.....
1995వ సంవత్సరంలో తమిళ చిత్ర పరిశ్రమలో వాయిస్ ఓవర్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మనోకి మరో ముఖం కనిపించింది. తమిళంలో రజనీకాంత్ నటించిన దాదాపు అన్ని చిత్రాలకు తన వాయిస్‌ని డబ్బింగ్‌ చేశారు. అతని స్వరం దాదాపు రజనీకాంత్‌కి పర్యాయపదంగా మారింది మరియు దర్శకులు మరియు నిర్మాతలందరి నుండి బాగా డిమాండ్ చేయబడింది. అతను తెలుగులో కొన్ని సినిమాలలో కమల్ హాసన్ కోసం తన వాయిస్ డబ్బింగ్ కూడా చెప్పారు.
• పేరు వెనుక చరిత్ర .....
నాగూర్ బాబు గారి అమ్మ గారి నాన్న గారు నాగూర్ సాహెబ్ నాదస్వర విద్వాంసుడు. ఆయన, ప్రసిద్ధ నాదస్వర విద్వాంసుడు షేక్ చినమౌలానా ఒకే గురువు దగ్గర ఆ విద్య నేర్చుకున్నారు. ఇతని అమ్మ పేరు షహీదా, పెద్దమ్మ పేరు వహీదా. వాళ్ళిద్దరి పేరుతో కార్యక్రమాలు జరిపేవారు. గుంటూరు జిల్లా యద్దనపూడి, దొండపాడు, తదితర గ్రామాల్లో మునసబు, కరణాల ఇళ్ళ దగ్గర, రచ్చబండ్ల దగ్గరకు వెళ్ళి ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు. అక్కడ ఇచ్చిన బియ్యం, దుస్తులతో జీవితం గడిపేవాళ్ళు. ఒక్కమాటలో చెప్పాలంటే, పూట కూలీ కళాకారుల కుటుంబం వీరిది. వీరి తాత గారు నాగూర్ సాహెబ్ 1964లో చనిపోయారు. మరుసటేడు అక్టోబర్ 26న వీరు జన్మించారు. అందుకే, నాగూర్‌బాబు అని ఆయన పేరే పెట్టారు.
• అభిరుచులు...ఇష్టాలు .....
ఆయన అభిమాన గాయకులు కిషోర్ కుమార్, రఫీ, జేసుదాసు, బాలు, జానకి, సుశీల, వాణీ జయరాం. ఘంటసాల పాడిన మనసున మనసై అనే పాట ఆయనకు ఎంతో ఇష్టం. పాకీస్థాని గాయకుడు గులాం అలీ అంటే కూడా బాగా అభిమానిస్తాడు.
• మత సామరస్యం.....
"పేరుకు ముస్లిం సంప్రదాయమైనా మేం అన్ని మతాలను గౌరవిస్తాం. రంజాన్‌ని ఎంత ఘనంగా చేసుకుంటామో దీపావళి, క్రిస్‌మస్‌లను కూడా అంతే గొప్పగా జరుపుకొంటాం.--నాగూర్ బాబు
......
"మేం ఏటా తిరుమలకు కాలినడకన వెళతాం. ఆయన శబరిమలైకి వెళ్లి అయప్పస్వామిని దర్శించుకుంటారు."—నాగూర్ బాబు భార్య జమీలా.
........
ముఖ్యంగా ఆంధ్రలో ముస్లిం దూదేకులు సగం ఇస్లామీయ సంస్కృతి, సగం హిందూ సంస్కృతి ఆచరిస్తారు. నిజమైన లౌకికవాదులు దూదేకులు. వీరు ముస్లిం - హిందూ సంస్కృతుల సమ్మేళనంగా వుంటూ ఈ రెండూ మతాల మధ్య దూరాన్ని చెరిపేసేరు. ‘హిందూ - ముస్లిం భాయి భాయి’ అన్న నినాదం దూదేకులకు జీవనసూత్రం అయింది. అన్ని మతాలనూ ఆచరించే కులం. శతాబ్దాల క్రితమే వీరు హిందూ మతం నుంచి ముస్లిం మతంలోని మారినా ఇప్పటి తరంలోనూ ఆ వాసనలు పోలేదు. హిందూత్వం పులుముకున్న ముస్లింలు వీరిలో కనిపిస్తారు. అయితే మతమౌఢ్యం మచ్చుకైనా కనిపించదు. రంజాన్, బక్రీద్,‌ వంటి ముస్లిం పండుగలను ఎంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో, హిందువుల పండుగలనూ అంత నిష్ఠతో జరుపుకుంటారు.
• వ్యక్తిగత జీవితము.......
మనో గారికి 19 ఏళ్ళ వయసులోనే 1985లో పెళ్ళయింది. భార్య పేరు - జమీలా. వాళ్ళది తెనాలి. ఆ ఊళ్ళోనే సంప్రదాయ ముస్లిమ్ పద్ధతిలో వివాహం జరిగింది. అది 1985 జూన్ 9వ తేది. ఇతని జీవితంలో అది మరపురాని తేది. సాక్షాత్తూ వీరి గురువు కె.చక్రవర్తి గారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి, సాక్షి సంతకాలు చేశారు. ఇతనికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పిల్లలకు కూడా సినిమా రంగంలో అభిరుచి ఎక్కువ. పెద్దవాడు షకీర్ తమిళ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక, చిన్నవాడు రతేశ్ కూడా సినిమాల్లోకి వస్తున్నాడు. అమ్మాయి సోఫియా డిగ్రీ చదువు పూర్తయింది. అమ్మాయికి పాడడం మీద ఆసక్తి ఎక్కువ. ఇప్పటికే అమెరికా వచ్చి, ‘స్వరాభిషేకం’ కార్యక్రమంలో పాటలు పాడింది.
• అస్థిపాస్తులు .....
నాగూర్ బాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా దాదాపు బాగా సంపాదించారు అని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. అంతేకాకుండా వీరు అనేక రియల్ ఎస్టేట్ వెంచర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వాణిజ్య ప్రకటనల్లో తరుచుగా కనిపిస్తుంటారు.
• అవార్డులు.....
1) మనో చిన్న తంబిలోని "తులియేలా" పాటకు తమిళనాడు ప్రభుత్వం నుండి " కలైమామణి " అవార్డును కూడా అందుకున్నారు.
2) 1991 – తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ – వివిధ చిత్రాలకు.
3) 1997 – ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు – తెలుగు – “రుకు రుకు రుక్మిణి” – పెళ్లి
4) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నుండి డాక్టర్ ఘంటసాల అవార్డును పొందారు

6
333 views