ఓట్ల పథకాలు తప్ప ప్రభుత్వాలకు వరదనిరోధక పథకాలు అవసరంలేదు.
ఓట్ల పథకాలు తప్ప ప్రభుత్వాలకు వరదనిరోధక పథకాలు అవసరంలేదు.
దశాబ్దాలుగా వరదలవల్ల అపార జననష్టం, వనరుల నష్టం, జరుగుతున్నా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు కూడా కనిపించటం లేదు.
వరదలు నివారించే దీర్ఘకాలిక చర్యలు మృగ్యం.
నీరు పల్లమెరుగు, నిజము దేవుడెరుగు అన్నది అందరికీ తెలిసిందే.
ఆ పల్లపు ప్రాంతాలు,ప్రవాహ ప్రాంతాలు కబ్జా చేసేవారు, అక్కడ నిర్మాణాలు చేసేవారు పెరిగి పోయారు.
వారికి ఎటువంటి శిక్షలూ లేవు.
సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ లు అనే తేడా లేకుండా, కనీసం బాధితులకు అత్యవసరంగా ఆహారపు పొట్లాలు సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
-తూములూరి మధుసూదన రావు