logo

*శ్రీ శ్రీ శ్రీ అభయ గణపతి ప్రతిష్టాపన మరియు అన్న సమారాధన మహోత్సవం లో మన సిరమ్మ*

ఈరోజు విజయనగరం, ధర్మపురిలో శ్రీ అభయ గణపతి ప్రతిష్టాపన మరియు అన్నసమారాధన ఆహ్వానం మేరకు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్. ఆర్.సీ.పి.జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త గౌ!! నీ!! శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)గారి కుమార్తె *చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ* బుధవారం ఉదయం గం!! 10.00 లకు శ్రీ అభయ గణపతి ప్రతిష్టాపనా లో పాల్గొన్నారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం, గవ్యాంత మార్చనలు, పునః పూజలు,ధాన్యాది వాసం,అగ్ని ప్రతిష్ట, ఆవాహిత దేవతా హవనములు,లక్ష్మీ గణపతిహోమం తదితర కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమం లో పాల్గొని భక్తులకు ప్రసాదం వితరణ చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, ముఖ్యనాయకులు, గ్రామ ప్రజలు, చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోట వాసు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.

15
1299 views