logo

నంద్యాల పట్టణ ప్రజలు మొంతా తుఫాన్ తో జాగ్రత్తగా ఉండండి.

నంద్యాల (AIMA MEDIA): మొంథా తూఫాన్ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ నంద్యాల వారు పేర్కొన్నారు. తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాల వల్ల కుందూ నది, మద్దిలేరు వాగు మరియు చామ కాల్వ ఉధృతి దృష్ట్యా వాహనదారుల రాకపోకలకు సంబంధించి పోలీస్ మరియు రెవెన్యూ సంయుక్తంగా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది . పట్టణంలో మట్టి మిద్దెల్లో నివసించే వారు సురక్షిత ప్రాంతాలకు లేదా బంధుమిత్రుల ఇళ్ళలో తాత్కాలికంగా షెల్టర్ తీసుకోవాలని సూచించారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం పట్టణంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దని వాగులు వంకలు దాటవద్దని హెచ్చరించారు. తుఫాను ప్రభావం తగ్గేవరకు మున్సిపల్ సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని అన్ని సహాయక చర్యలు చేపట్టామని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న తెలిపారు.

3
9 views