logo

Rain Alert: తరుముకొస్తున్న మోంథా.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..... లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన తుఫాను “మోంతా” గత 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో ఉత్తర- వాయువ్య దిశగా కదిలి, ఈరోజు ఉదయం 0830 గంటలకు అదే ప్రాంతంపై, 14.9° ఉత్తర అక్షాంశం & 82.9° తూర్పు రేఖాంశం వద్ద, మచిలీపట్నం (ఆంధ్రప్రదేశ్)కి దక్షిణ-ఆగ్నేయంగా 160 కి.మీ., కాకినాడ (ఆంధ్రప్రదేశ్)కి దక్షిణ-ఆగ్నేయంగా 240 కి.మీ., విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)కి దక్షిణ-నైరుతి దిశలో 320 కి.మీ., గోపాల్‌పూర్ (ఒడిశా)కి దక్షిణ-నైరుతి దిశలో 530 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ, ఈరోజు (అక్టోబర్ 28) సాయంత్రం/రాత్రి సమయంలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ పరిసరాల్లో తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరము దాటే సమయములో స్థిరమైన పెనుగాలులు గంటకు 90-100 కి.మీ గరిష్టంగా 110కి.మీ వేగంతో గాలులు వీస్తాయి....

4
47 views