logo

మొందా తుఫాన్ నేపథ్యంలో పెనుబాక గ్రామంలో అవగాహన సమావేశం


విజయనగరం జిల్లా.రాజాం, అక్టోబర్ 28:

మొందా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తుఫాన్ కారణంగా భారీ వర్షాలు, గాలులు వీచే అవకాశం ఉన్నందున గ్రామ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ రాజాం సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, ఎమ్మార్వో రాజశేఖర్ లు పెనుబాక గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ —
“తుఫాన్ సమయంలో పాత బిల్డింగులు, కల్లాలు, చెరువుల దగ్గర, పెద్ద వృక్షాల క్రింద ఉండరాదు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించండి. విద్యుత్ తీగలు తెగి పడినప్పుడు వాటికి దగ్గర కావద్దు. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండేలా చూడాలి,” అని గ్రామ ప్రజలకు సూచించారు.

సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ, పోలీసు విభాగం మరియు రెవెన్యూ అధికారులు తుఫాన్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఎమ్మార్వో రాజశేఖర్ మాట్లాడుతూ, పల్లెల్లో ప్రమాదానికి గురయ్యే ఇళ్లను గుర్తించి అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపడతామని తెలిపారు.

ఈ సమావేశంలో ఎస్ఐ వై.రవి కిరణ్, జడ్పిటిసి బండి నరసింహులు,గ్రామ గ్రామ పెద్దలు,హెల్త్ ఇతర సిబ్బంది, గ్రామ యువకులు పాల్గొన్నారు. అధికారులు గ్రామ ప్రజలకు తుఫాన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

50
1197 views