logo

ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు పటిష్ట భద్రత – జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అక్టోబర్28 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎం), వీవీప్యాట్ల భద్రత కోసం గోదాముల్లో పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించే సాధారణ నెలవారీ తనిఖీల్లో భాగంగా, కలెక్టర్ మంగళవారం విజయవాడ గ్రామీణంలోని గొల్లపూడి గోదామును అధికారు లతో కలిసి పరిశీలించారు.
తనిఖీ సందర్భంగా సీసీ కెమెరా ల పనితీరు, అగ్నిమాపక పరిక రాల అందుబాటు,గోదాములోని భద్రతా చర్యలను వివరంగా పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ, “ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరుస్తూ, సమగ్ర తనిఖీలు నిర్వహిస్తున్నాం. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో పారదర్శకంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది,” అన్నారు.
అలాగే, గోదాములో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి, సీసీ కెమెరాల పర్యవేక్షణలో గట్టి నిఘా ఉంచాలని ఆయన సూచించారు. తనిఖీ కార్యక్రమం లో డీఆర్‌వో ఎం. లక్ష్మీనర సింహం, గునుపూడి రామయ్య (తెలుగుదేశం), వై. ఆంజనేయ రెడ్డి (వైఎస్ఆర్‌సీపీ), జగడం శ్రీనివాసరావు (జనసేన), కందుల పరమేశ్వరరావు (ఆమ్ఆద్మీ పార్టీ), తరుణ్ కాకాని (బీజేపీ), కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

5
829 views