అరకు: వాయుపుత్ర మోటార్ యూనియన్ అధ్యక్షులుగా పాంగి నాగర్జున
అరకులోయ వాయుపుత్ర మోటార్ యూనియన్ ఎలక్షన్ జరిగినట్లు మంగళవారం యూనియన్ సభ్యులు తెలిపారు. ఈ ఎలక్షన్ లో అధ్యక్ష స్ధానానికి కిల్లో సహదేవ్, పాంగి నాగర్జున పోటీ చేశారు. కాగా యూనియన్ మెజారిటీ సభ్యులు పాంగి నాగార్జునను అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ మేరకు అధ్యక్షులుగా గెలిపొందిన నాగార్జున మాట్లాడుతూ.. యూనియన్ సభ్యులు తన ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా యూనియన్ సమస్యల పరిష్కారం కొరకు పనిచేస్తానని అన్నారు.