logo

మొంథా తుపాను నేపథ్యంలో కొండ ప్రాంతాలను పరిశీలించిన నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు, ఐ.పి.ఎస్.

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అక్టోబర్28 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)

మొంథా తుపాను పరిస్థితుల దృష్ట్యా ప్రజల భద్రత కోసం సమగ్ర చర్యలు చేపట్టినట్లు నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఐ.పి.ఎస్. తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని శాఖల అధికారు లను సమన్వయం చేసుకుంటూ పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో, ఈ రోజు కమిషనర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి లోని కొండప్రాంతాలను స్వయం గా పరిశీలించారు. కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాలను పర్యవేక్షించి, స్థానిక ప్రజలతో మాట్లాడి, తుపాను కారణంగా ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా సురక్షిత ప్రాంతాలకు లేదా జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలి పోవాలని సూచించారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ "మొంథా తుపాను నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాం. సిబ్బందిని అప్రమత్తం చేసి, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వాగులు, వంకలు పొంగిన ప్రదేశాలను డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ, సమస్య తీవ్రతను తక్షణమే అధికారు లకు తెలియజేసే విధంగా చర్యలు చేపట్టాం. కొండ ప్రాంతాల ప్రజలను కూడా సురక్షితంగా ఉండేలా హెచ్చరికలు జారీ చేశాం,” అని తెలిపారు.
కమిషనర్ తో పాటు పశ్చిమ ఏసీపీ దుర్గారావు, టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ చిన్న కొండలరావు, వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ గురు ప్రకాష్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ డి.వి. రమణ, ఇన్‌స్పెక్టర్ గుణరామ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

10
152 views