logo

నకిలీ పట్టా పాసుబుక్కు లు పొందిన వారిపై చర్యలు తీసుకోవాలనీ వినతి...వికలాంగుల సంఘం.

నంద్యాల జిల్లా లోని రుద్రవరము మండలం గ్రామానికి చెందిన ఎస్సీ కులానికి చెందిన వికలాంగుడు ఎన్ సుధాకర్ గారికి చిన్న కంబలూరు గ్రామంలో సర్వే నంబర్ 270 / 2, విస్తీర్ణము 3 ఎకరాలు గల భూమిని ప్రభుత్వం వారు 2006లో డి పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చారు.. ఆ భూమి సాగు చేసుకునే జీవనం సాగించే క్రమంలో కొందరు అదే గ్రామానికి చెందిన భూకబ్జాదారులు ఆ భూమిని నకిలీ పట్టాలతో ఆక్రమించి కోర్టుకు కేసు వేయగా ఆంధ్రప్రదేశ్ గౌరవ న్యాయస్థానం కోర్టు వారు సుధాకర్ వికలాంగునికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు అయితే నకిలిపటాలతో భూమిని ఆక్రమించిన వారిపై ఇంతవరకు నంద్యాల జిల్లా ఎస్పీ గారిని ,నంద్యాల జిల్లా కలెక్టర్ గారిని పలుసార్లు అర్జీ రూపంలో విన్నవించుకున్న న్యాయం జరగకపోగా.. వికలాంగుల ఆదరణ సేవా సమిత్ రాష్ట్ర అధ్యక్షులు మరియు దాసు గారి అధ్యక్షతన పలువురు వికలాంగులతో రుద్రవరం తాసిల్దార్ గారిని కలిసి పొలానికి సంబంధించిన విషయం అంతా సవివరంగా తెలియజేయడం జరిగింది అయితే రెవెన్యూ అధికారులు కలెక్టర్ గారికి తప్పుడు ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది.. ఆ ఎండార్స్మెంట్ కూడా తప్పు అని సంబంధిత తాసిల్దార్ గారికి వివరించడం జరిగింది అన్ని రెవెన్యూ రికార్డులు పరిశీలించి భూకబ్జాదారులపై నకిలీ పట్టాలతో సుధాకర్ భూముల ఆక్రమించిన వారిపై వికలాంగుల చట్టం 2016 మరియు సివిల్ క్రిమినల్ కేసు నమోదు చేయాలని అలా చేయని పక్షంలో రుద్రవరం తాసిల్దార్ ఎదుట అన్ని వికలాంగుల సంఘాల మరియు ప్రజా సంఘాల నాయకుల మద్దతు తో భారీగా తాసిల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా చేస్తామని ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని త్వరలో కలవనున్నట్లు మరియదాసు గారు తెలియజేశారు కావున వికలాంగులకు న్యాయం చేసేంతవరకు అన్ని వికలాంగుల సంఘాల మద్దతు ఉంటుందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆదరణ సేవా సమితి వికలాంగుల రాష్ట్ర అధ్యక్షులు జజారి మరి దాస్ గారు మన నంద్యాల జిల్లా మహిళా వికలాంగుల అధ్యక్షురాలు కె శివమ్మ మరియు ఎన్ సుధాకర్ రుద్రవరం మండల అధ్యక్షులు అబ్దుల్లా సత్తార్ ఎల్లప్ప సులోచన పాల్గొని35 కేజీల రేషన్ కార్డులు మరి ఇంటి పట్టాలు అను సమస్యల పైన తాసిల్దార్ గారిని అడగడం జరిగింది సానుకూలంగా స్పందించి వీటిని అన్నిటిని ప్రభుత్వానికి పంపించి నీకు న్యాయం జరిగేలా చూస్తానని ఆమె ఇవ్వడం జరిగింది

28
2631 views