logo

నంద్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెండు రోజులపాటు పాఠశాలలకు సెలవులు

AIMA న్యూస్ .మెంథా తుఫాన్ కారణంగా నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ మంగళవారం రోజున ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేడు, రేపు రెండు రోజులపాటు తుఫాన్ కారణంగా సెలవులు ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని పాఠశాలలు వర్షాలకు దెబ్బతిని పై కప్పు ఊడిపోయే ప్రమాదం ఉన్నందున సెలవులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంఈఓలకు డీఈవో జనార్దన్ రెడ్డి సెలవులకు సంబంధించి సర్కులర్ జారీ చేశారు

113
4067 views